Share News

Religious Visit : గుణదల మేరీమాతను దర్మించుకున్న షర్మిల

ABN , Publish Date - Feb 09 , 2025 | 03:50 AM

మేరీమాత పుణ్యక్షేత్రాన్ని సందర్శించిన షర్మిల.. కొవ్వొత్తులు వెలిగించి, మరియమాతను దర్శించుకున్నారు.

Religious Visit : గుణదల మేరీమాతను దర్మించుకున్న షర్మిల

గుణదల, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): దక్షిణ భారత దేశంలోనే అతిపెద్ద క్రైస్తవ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న గుణదల మేరీమాత ఆలయాన్ని పీసీసీ చీఫ్‌ షర్మిల శనివారం సందర్శించారు. ఇక్కడ ఆదివారం నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా మేరీమాత పుణ్యక్షేత్రాన్ని సందర్శించిన షర్మిల.. కొవ్వొత్తులు వెలిగించి, మరియమాతను దర్శించుకున్నారు. షర్మిలకు ఆలయ రెక్టర్‌ యేలేటి విలియం జయరాజు ప్రత్యేక ప్రార్థనలు చేసి ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్బంగా షర్మిల మాట్లాడుతూ చారిత్రక పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఉత్సవాలకు తరలివచ్చే భక్తులకు మరియమాత ఆశీస్సులు మెండుగా అందాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఉత్సవ ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Pawan Kalyan: ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం.. పవన్ కల్యాణ్ రియాక్షన్ ఇదే..

Betting Apps: బెట్టింగ్ యాప్స్ భూతానికి మరో యువకుడు బలి..

Updated Date - Feb 09 , 2025 | 03:51 AM