Share News

Panchayat Raj : ఉపాధి సిబ్బందికి ఊరట

ABN , Publish Date - Jan 24 , 2025 | 04:53 AM

పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో పనిచేస్తున్న ఉపాధి సిబ్బందిలో మరో 36 మందికి ఊరట లభించింది.

 Panchayat Raj : ఉపాధి సిబ్బందికి ఊరట

  • మరో 36 మంది ఉద్యోగాల పునరుద్ధరణ

అమరావతి, జనవరి 23(ఆంధ్రజ్యోతి): పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో పనిచేస్తున్న ఉపాధి సిబ్బందిలో మరో 36 మందికి ఊరట లభించింది. కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న టెక్నికల్‌ అసిస్టెంట్లు, కంప్యూటర్‌ ఆపరేటర్లు, అటెండర్లు, స్వీపర్లకుజీతాలివ్వకుండా వేధించిన గత వైసీపీ ప్రభుత్వం చివరకు వారిని ఉద్యోగాల నుంచి తొలగించినట్లు ప్రకటించింది. ఇప్పుడు ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ చొరవతో పీఆర్‌ ఇంజనీరింగ్‌, ఈఎన్‌సీ కార్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించే దిశగా అధికారులు చర్యలు తీసుకున్నారు. తొలుత 519 మందిని, తర్వాత మరో 38మందిని ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. అప్పట్లో తక్కువ అర్హతలు ఉండి పోస్టులు పొందలేకపోయిన 36 మందికి ఇప్పుడు ఆఫీసు అసిస్టెంట్లుగా ఉద్యోగాలు కల్పించారు. దీనిపై ఉపముఖ్యమంత్రికి, కమిషనర్‌కు, ఉపాధి డైరెక్టర్‌కు సిబ్బంది ధన్యవాదాలు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి...

Fog Effect: గన్నవరం ఎయిర్‌పోర్టుకు రావలసిన పలు విమానాలు ఆలస్యం

Lokesh Visit Davos: అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయండి: మంత్రి లోకేష్

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 24 , 2025 | 04:53 AM