Share News

Pawan-Uppada: పవన్ పిఠాపురం పర్యటన: ఉప్పాడ మత్స్యకారుల సమస్యలపై చర్చలు, బహిరంగ సభ

ABN , Publish Date - Oct 09 , 2025 | 10:33 AM

పవన్ ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఉప్పాడ మత్స్యకారుల సమస్యలపై కమిటీతో చర్చిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఉప్పాడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మత్స్యకారులతో ప్రత్యక్షంగా..

Pawan-Uppada: పవన్ పిఠాపురం పర్యటన: ఉప్పాడ మత్స్యకారుల సమస్యలపై చర్చలు, బహిరంగ సభ
Pawan Kalyan Kakinada tour

కాకినాడ, అక్టోబర్ 9: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. సముద్ర కాలుష్యం కారణంగా కష్టాలు ఎదుర్కొంటున్నామని చెబుతున్న ఉప్పాడ మత్స్యకారుల సమస్యలను పరిష్కరించేందుకు పవన్ ఈ పర్యటన చేస్తున్నారు.


స్థానిక ఫార్మా కంపెనీలు సముద్రంలోకి వ్యర్థ రసాయనాలు వదులుతున్నాయంటూ మత్స్యకారులు సెప్టెంబర్‌లో వివిధ రకాల ఆందోళనలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో కూటమి ప్రభుత్వం 5 మంది సభ్యులతో ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగానే డిప్యూటీ సీఎం పవన్ ఈ ఉదయం 10 గంటలకు కాకినాడ జిల్లా కలెక్టరేట్‌లో మత్స్యకారుల ప్రతినిధులు, ఇండస్ట్రీస్, ఫిషరీస్ కమిషనర్లు, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యులతో సమావేశం నిర్వహిస్తున్నారు.


ఈ కమిటీ, సముద్ర కాలుష్య ప్రభావం, జీవనోపాధి, పరిహారాలు వంటి అంశాలపై చర్చిస్తోంది. సముద్ర జలాలు కలుషితమవుతున్నాయని, చేపలు, సముద్ర జీవులు నశిస్తున్నాయని మత్స్యకారుల ఆరోపణల మేరకు తగిన చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇందుకోసం పవన్ కల్యాణ్ ఈ మధ్యాహ్నం సముద్రంలో ప్రయాణించి ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు ఉప్పాడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని, మత్స్యకారులతో ప్రత్యక్షంగా మాట్లాడుతారు.


ఇవి కూడా చదవండి..

ఈ కార్మికులు చాలా తెలివైన వాళ్లు.. బస్తాను పైకి ఎలా పంపుతున్నారో చూడండి..

ఈ ఫొటోలో రెండో కారు కూడా ఉంది.. ఎక్కడ.. 6 సెకెన్లలో కనిపెట్టండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Oct 09 , 2025 | 12:45 PM