Share News

Pawan Kalyan: చివరి ఉగ్రవాదిని అంతం చేసేవరకూ సిందూర్‌ ఆగకూడదు

ABN , Publish Date - May 08 , 2025 | 03:40 AM

చివరి ఉగ్రవాదిని అంతం చేసే వరకు ఆపరేషన్‌ సిందూర్‌ కొనసాగాలని పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించారు. దేశ భద్రతపై విమర్శలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు

Pawan Kalyan: చివరి ఉగ్రవాదిని అంతం చేసేవరకూ సిందూర్‌ ఆగకూడదు

‘చివరి ఉగ్రవాదిని అంతం చేసే వరకు ఆపరేషన్‌ సిందూర్‌ ఆగకూడదు’ అని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ హైదరాబాద్‌లో అన్నారు. ‘ఉగ్రవాదంపై పోరాటంలో ప్రధాని నరేంద్ర మోదీ తీసుకునే నిర్ణయానికి భారతీయులసంపూర్ణ మద్దతు ఉంటుంది. ఈ కీలక సమయంలో దేశ ప్రజలంతా ఏకతాటిపై నిలిచి, ఐక్యతను ప్రదర్శించాలి. దేశంపై జరిగిన దాడిని ప్రతి ఒక్కరు తీవ్రంగా పరిగణించాలి. భారత సైన్యం చర్యలకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేసే వారిపై కేంద్రం కఠిన చర్యలు తీసుకుంటుంది. సోషల్‌ మీడియాలో ఇష్టారాజ్యంగా కుక్కల్లా మొరగవద్దు. దేశాన్ని సెలబ్రిటీలు నడిపించడం లేదు. వారు కూడా బాధ్యతగా, దేశ సమగ్రతను కాపాడేలా మాట్లాడాలి’ అని పవన్‌ అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పహల్గామ్ దాడిలో మరో కుట్ర..

ఆపరేషన్ సింధూర్‌పై చిరంజీవి ట్వీట్

ఎమర్జెన్సీ ప్రకటించిన పాకిస్తాన్..

For More AP News and Telugu News

Updated Date - May 08 , 2025 | 03:40 AM