Share News

AP News: ఆయా.. కొడుకు.. ఇదీ ఓ అంగన్‌వాడీ కేంద్రం..

ABN , Publish Date - Sep 03 , 2025 | 12:51 PM

రొళ్ల మండలం కాలువపల్లి మినీ అంగన్‌వాడీ కేంద్రంలో మంగళవారం చిత్రమైన పరిస్థితి కనిపించింది. కేంద్రానికి ఇద్దరంటే ఇద్దరే చిన్నారులు వస్తున్నారు. వారిలో ఒకరు గైర్హాజరయ్యారు. దీంతో ఒకే ఒక బాలుడు హాజరయ్యాడు.

AP News: ఆయా.. కొడుకు.. ఇదీ ఓ అంగన్‌వాడీ కేంద్రం..

- రొళ్ల(అనంతపురం): రొళ్ల మండలం కాలువపల్లి(Kaluvapalli) మినీ అంగన్‌వాడీ కేంద్రంలో మంగళవారం చిత్రమైన పరిస్థితి కనిపించింది. కేంద్రానికి ఇద్దరంటే ఇద్దరే చిన్నారులు వస్తున్నారు. వారిలో ఒకరు గైర్హాజరయ్యారు. దీంతో ఒకే ఒక బాలుడు హాజరయ్యాడు. ఆ చిన్నారిని ఆయా కల్పన తీసుకొచ్చారు. వారిద్దరే అంగన్‌వాడీ కేంద్రంలో కనిపించారు. విచిత్రమేమిటంటే ఆ బాలుడు.. ఆయా కల్పన కుమారుడే.


zz.jpg

తల్లి, కుమారుడే రోజంతా అంగన్‌వాడీ కేంద్రంలో గడిపారు. కేంద్రం నిర్వహణ, మధ్యాహ్న భోజనం తదితరాలు ఎలా చేస్తారో.. ఏమో..? కార్యకర్త చైత్ర ఉదయం 11.00 గంటలకు కేంద్రానికి వచ్చారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడమే ఈ దుస్థితికి కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

బంగారం ధరలు మరింత పైకి.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

జూబ్లీహిల్స్‌లో 3,92,669 మంది ఓటర్లు

Read Latest Telangana News and National News

Updated Date - Sep 03 , 2025 | 12:51 PM