Share News

Nara Bhuvaneshwari : తలసేమియా బాధితులకు బాసట

ABN , Publish Date - Jan 25 , 2025 | 02:59 AM

తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులకు వైద్యం అందించడానికి రాష్ట్రంలో ఐదు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు నారా భువనేశ్వరి...

Nara Bhuvaneshwari : తలసేమియా బాధితులకు బాసట

  • 15న విజయవాడలో తమన్‌ మ్యూజికల్‌ నైట్‌

  • ఏర్పాట్లను పరిశీలించిన నారా భువనేశ్వరి

విజయవాడ, మంగళగిరి సిటీ, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులకు వైద్యం అందించడానికి రాష్ట్రంలో ఐదు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు నారా భువనేశ్వరి వెల్లడించారు. ఒక్కో కేంద్రం ఏర్పాటుకు రూ.60 లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పారు. దీనికి విరాళాలు సేకరించేందుకు ఎన్టీఆర్‌ మోమోరియల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో వచ్చే నెల 15న విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో సంగీత దర్శకుడు తమన్‌తో మ్యూజికల్‌ నైట్‌ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఆ ఏర్పాట్లను శుక్రవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మ్యూజికల్‌ నైట్‌ టికెట్ల అమ్మకం ద్వారా వచ్చిన డబ్బులను తలసేమియాతో బాధపడే వారి సహాయార్థం అందజేస్తామన్నారు. స్టేడియంలో మ్యూజికల్‌ నైట్‌ ఏర్పాట్ల గురించి పోలీసు కమిషనర్‌ రాజశేఖరబాబును అడిగి తెలుసుకున్నారు.

‘అక్షయపాత్ర’లో బియ్యం శుభ్రపరిచే యంత్రం ప్రారంభం

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామంలోని అక్షయపాత్ర ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కేంద్రీకృత వంటశాలను నారా భువనేశ్వరి శుక్రవారం సందర్శించారు. నూతనంగా ఏర్పాటు చేసిన బియ్యం శుభ్రపరిచే యంత్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలుచేస్తున్న ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం’ ద్వారా దాదాపు 25 వాహనాల్లో ప్రతిరోజూ ఇక్కడి నుంచి 30 వేల మంది పిల్లలకు భోజనం సరఫరా చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో అక్షయపాత్ర మంగళగిరి అధ్యక్షుడు వంశీధర దాస, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, విలాస విగ్రహ దాస, రఘునందన్‌ దాస, ఏపీ పద్మశాలి కార్పొరేషన్‌ చైర్మన్‌ నందం అబద్దయ్య, టీటీడీ ధర్మకర్త తమ్మిశెట్టి జానకీదేవి పాల్గొన్నారు.


మరిన్ని తెలుగు వార్తలు కోసం..

Also Read: మరికొన్ని గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు.. రైతు భరోసా పథకానికి కావాల్సింది ఇవే..

Also Read : తురకా కిషోర్‌ను నెల్లూరు జైలుకు తరలింపు

Also Read: కిడ్నీ రాకెట్ కేసు సీఐడీకి: మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశం

Also Read: రైలు ప్రమాద బాధితులు.. నష్ట పరిహారం ఎలా క్లెయిమ్ చేసుకోవాలంటే..?

For AndhraPradesh News And Telugu News

Updated Date - Jan 25 , 2025 | 03:00 AM