Share News

Education Department: టీచర్లతో సంబంధం లేని పనులు చేయించొద్దు!

ABN , Publish Date - Jul 29 , 2025 | 05:31 AM

పాఠశాలలకు ప్రత్యక్షంగా సంబంధం లేని ఇతర శాఖల పనులను ప్రిన్సిపాళ్లు, హెచ్‌ఎంలు, టీచర్లకు అప్పగించొద్దని..

Education Department: టీచర్లతో సంబంధం లేని పనులు చేయించొద్దు!

  • పాఠశాల విద్యాశాఖ స్పష్టీకరణ

అమరావతి, జూలై 28 (ఆంధ్రజ్యోతి): పాఠశాలలకు ప్రత్యక్షంగా సంబంధం లేని ఇతర శాఖల పనులను ప్రిన్సిపాళ్లు, హెచ్‌ఎంలు, టీచర్లకు అప్పగించొద్దని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్‌ అధికారులకు స్పష్టం చేశారు. దీనిపై సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. కొన్ని జిల్లాల్లో స్కూళ్లకు సంబంధం లేని పనులను ప్రభుత్వ యాజమాన్యాల్లోని పాఠశాలలకు అప్పగిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. ఇకపై హెచ్‌వోడీల అనుమతి లేకుండా ఎవరూ శాఖకు సంబంధం లేని ఇతర పనులు చేయకూడదన్నారు. శాఖకు సంబంధం లేని పనులను పాఠశాలలకు అప్పగించడం వల్ల బోధన పనులకు అడ్డంకి ఏర్పడుతోందని పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

22 నిమిషాల్లో ఆపరేషన్ సిందూర్ పూర్తి చేశాం: రాజ్‌నాథ్

పహల్గాం దాడికి అమిత్‌షా బాధ్యత తీసుకోవాలి: గౌరవ్ గొగోయ్

For More National News and Telugu News..

Updated Date - Jul 29 , 2025 | 05:31 AM