Share News

NMMS Scholarship: వెబ్‌సైట్‌లో ఎన్‌ఎంఎంఎస్‌ దరఖాస్తు

ABN , Publish Date - Sep 04 , 2025 | 03:14 AM

డిసెంబరు ఏడో తేదీన నిర్వహించనున్న నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షి్‌ప ఎన్‌ఎంఎంఎస్‌..

NMMS Scholarship: వెబ్‌సైట్‌లో ఎన్‌ఎంఎంఎస్‌ దరఖాస్తు

అమరావతి, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): డిసెంబరు ఏడో తేదీన నిర్వహించనున్న నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షి్‌ప(ఎన్‌ఎంఎంఎస్‌) పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ http://www.bse.ap.gov.in/ వెబ్‌సైట్‌లో గురువారం నుంచి అందుబాటులో ఉంటుందని ప్రభుత్వ పరీక్షల సంచాలకుడు డాక్టర్‌ కేవీ శ్రీనివాసులురెడ్డి తెలిపారు. ‘దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ 30.9.2025. రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లాపరిషత్‌, మున్సిపల్‌, ఎయిడెడ్‌, మండల పరిషత్‌ ప్రాథమికోన్నత పాఠశాలలు, వసతి సౌకర్యం లేని ఆదర్శ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతూ, కుటుంబ వార్షికాదాయం రూ.3,50,000లోపు ఉన్న విద్యార్థులందరూ ఈ పరీక్ష రాయడానికి అర్హులు’ అని శ్రీనివాసులురెడ్డి వివరించారు.


తాడిపత్రిలో పొలిటికల్ హీట్.. నువ్వొస్తానంటే.. నే రానిస్తానా..!

పౌరుషానికి ప్రతీక నందమూరి హరికృష్ణ..

Read Latest Andhra Pradesh News and National News

Updated Date - Sep 04 , 2025 | 03:14 AM