Nimmala Ramanayudu: వ్యవసాయ పనుల్లో మంత్రి నిమ్మల
ABN , Publish Date - Jan 16 , 2025 | 05:36 AM
రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కనుమ పండుగ రోజు పొలం పనుల్లో నిమగ్నమయ్యారు.

రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కనుమ పండుగ రోజు పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. తన సొంతూరు పశ్చిమ గోదావరి జిల్లా ఆగర్తిపాలెంలో ఆయనకు పొలం ఉంది. బుధవారం ఆ పొలంలో ఆయన వరి చేలకు మందు స్ర్పే చేస్తూ కనిపించారు. వ్యవసాయమంటే తనకు ఎంతో ఇష్టమని, పండుగ రోజు కొంత తీరిక దొరకడంతో కూలీలతో కలిసి పని చేయడం సంతృప్తిని ఇచ్చిందన్నారు. విద్యార్థిగా ఉన్నప్పుడూ, అధ్యాపకుడిగా పని చేసినప్పుడూ సొంతంగా వరి సాగు చేసి ఎకరానికి 55 నుంచి 60 బస్తాలు దిగుబడి సాధించడమే కాక ఆక్వా సాగులోనూ మంచి ఫలితాలు సాధించానని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
-ఆంధ్రజ్యోతి, పాలకొల్లు రూరల్