Share News

Road Accident: అందరూ నిద్రిస్తుండగా ప్రమాదానికి గురైన బస్సు.. చివరికి పరిస్థతి ఇది..

ABN , Publish Date - Feb 24 , 2025 | 09:45 AM

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట వద్ద ప్రైవేట్ ట్రావెస్స్ బస్సు అదుపుతప్పింది. ఈ ప్రమాదంలో 17 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలు అయ్యాయి.

Road Accident: అందరూ నిద్రిస్తుండగా ప్రమాదానికి గురైన బస్సు.. చివరికి పరిస్థతి ఇది..
Road Accident

తిరుపతి: తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. బస్సు ప్రమాదాలు ప్రయాణికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో చోటు చేసుకుంది. సూళ్లూరుపేట సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. మార్నింగ్ స్టార్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తాపడి 17మందికి తీవ్రగాయాలు అయ్యాయి. పాండిచేరి నుంచి విజయవాడ వెళ్తున్న బస్సు అతివేగం కారణంగా అదుపుతప్పింది. దీంతో ఒక్కసారిగా పల్టీలు కొట్టింది. ప్రమాద సమయంలో మెుత్తం 24 మంది ఉండగా 17 మందికి గాయాలు అయ్యాయి. ప్రమాదాన్ని గుర్తించిన వాహనదారులు పోలీసులు, 108 సిబ్బంది సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు.. బాధితులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Updated Date - Feb 24 , 2025 | 09:45 AM