Simhachalam: ఏటా ఏదో ఒక గందరగోళం
ABN , Publish Date - May 01 , 2025 | 05:26 AM
ఏటా చందనోత్సవంలో అవ్యవస్థలు, ఇప్పుడే నిండు ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటన! సింహాచలంలో భక్తుల జానపదంగా గందరగోళం, అధికారులు మాత్రం సమీక్షలకే పరిమితం
సింహాచలంలో అస్తవ్యస్తంగా చందనోత్సవ ఏర్పాట్లు
ఇప్పుడు ఏకంగా నిండు ప్రాణాలు బలి
అమరావతి, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో జరుగుతున్న వరుస సంఘటనలు భక్తులను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. వైకుంఠ ఏకాదశి టికెట్ల క్యూలైన్లలో జరిగిన తొక్కిసలాటలో తిరుపతిలో ఆరుగురు మరణించిన ఘటన మరువక ముందే సింహాచలం శ్రీ వరాహలక్ష్మీనృసింహ స్వామి ఆలయంలో గోడ కూలి పలువురు భక్తులు మృతిచెందారు. సింహాచలంలో ఏటా చందనోత్సవం సందర్భంగా భక్తులు లక్షల్లో వస్తారని అంచనా ఉంది. కానీ దేవదాయ శాఖ అధికారులు ఎప్పుడూ విఫలం అవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత నాలుగేళ్లుగా ఏదొక ఒక సంఘటన జరుగుతూనే ఉంది. 2022, 2023లో అధికారుల నిర్లక్ష్యం కారణంగా భక్తులు స్వామివారి దర్శనం కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 2023లో ఐదు గంటలపాటు కొండపై ట్రాఫిక్ నిలిచిపోయింది.
దేవదాయ శాఖ, స్థానిక రెవెన్యూ, పోలీస్ అధికారుల మధ్య సమన్వయ లోపం కూడా భక్తులకు నరకం చూపిస్తోంది. వీరందరి నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా ఈసారి పెను విషాదం చోటుచేసుకుంది. నిజానికి, చందనోత్సవానికి ముందు కలెక్టర్, ఎస్పీ, దేవదాయ శాఖ, రెవెన్యూ, పోలీస్ అధికారులు రెండు, మూడుసార్లు సమీక్షలు నిర్వహించారు. అక్కడ ఏం సమీక్షించారో తెలియదుగానీ, గత రెండు, మూడేళ్ల అనుభవాలను బట్టిచూస్తే ముందస్తు ప్రణాళిక రచనలో అధికారులంతా విఫలమయ్యారని తెలుస్తోంది. కాగా, చందనోత్సవం రోజున ఆలయ ప్రాంగణంలో భక్తుల మృతి తర్వాత ఆలయాన్ని సంప్రోక్షణ చేయాలి. కానీ, అధికారులు భక్తులను దర్శనాలకు అనుమతించడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సంప్రోక్షన చేయకుండా దర్శనాలకు ఎలా అనుమతిస్తారంటూ ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
Also Read:
సామ్ కర్రన్ సూపర్ ఇన్నింగ్స్.. ఛాహల్ హ్యాట్రిక్
రిటైర్మెంట్‌పై బాంబు పేల్చిన ధోని
ఇలాంటి దోపిడీ ఎక్కడైనా చూశారా..
For More Andhra Pradesh News and Telugu News..