Share News

AP Ministers Committee: ప్రధాని పర్యటన ఏర్పాట్లకు మంత్రుల కమిటీ

ABN , Publish Date - Apr 19 , 2025 | 04:50 AM

ప్రధాని నరేంద్ర మోదీ మే 2న అమరావతికి పర్యటన చేపించనున్నారు. పర్యటన ఏర్పాట్ల కోసం ఆరుగురు మంత్రులతో రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది

AP Ministers Committee: ప్రధాని పర్యటన ఏర్పాట్లకు మంత్రుల కమిటీ

అమరావతి, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్ర మోదీ మే 2న అమరావతి పర్యనటకు రానున్నారు. రాజధాని అమరావతిలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు చేసేందుకు ఆరుగురు మంత్రులతో కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మున్సిపల్‌, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌, మానవ వనరులశాఖ మంత్రి లోకేశ్‌, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌, గనులశాఖ మంత్రి కొల్లు రవీంద్రతో కమిటీ సభ్యులుగా, వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌ వీరపాండ్యన్‌ను నోడల్‌ అధికారిగా నియమించారు.

Updated Date - Apr 19 , 2025 | 04:52 AM