Nara Lokesh: ఉపరాష్ట్రపతి అభ్యర్థి విషయంలో గందరగోళం లేదు.. నారా లోకేష్ క్లారిటీ
ABN , Publish Date - Aug 19 , 2025 | 09:18 PM
ఎన్‌డీఏ, ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విజయం కోసం పావులు కదుపుతున్నాయి. ఎన్డీఏ కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఇండియా కూటమి కూడా తమ ఉప రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించింది.
ఎన్డీఏ, ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విజయం కోసం పావులు కదుపుతున్నాయి. ఎన్డీఏ కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఇండియా కూటమి కూడా తమ ఉప రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, తెలుగు వాడైన జస్టిస్ బి. సుదర్శన్‌రెడ్డి పేరును ఇండియా కూటమి ప్రకటించింది. సుదర్శన్‌రెడ్డి 2007 నుంచి 2011 వరకు సుప్రీం న్యాయమూర్తిగా సేవలు అందించారు.
కాగా, తెలుగు వ్యక్తి ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో దిగడంతో ఎన్‌డీఏలో కీలక పార్టీ అయిన టీడీపీ పునరాలోచనలో పడుతుందని చాలా మంది భావించారు. అయితే ఆ విషయంలో తాము చాలా స్పష్టంగా ఉన్నామని టీడీపీ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ స్పష్టం చేశారు. ఎన్డీఏ బలపరిచిన అభ్యర్థి రాధాకృష్ణన్‌కే తమ సంపూర్ణ మద్దతు అని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. 'అస్పష్టత లేదు. కేవలం ఆప్యాయత, గౌరవం, సంకల్పం. ఎన్‌డీఐ ఐక్యంగా ఉంది' అని లోకేష్ ట్వీట్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వైసీపీకి బిగ్ షాక్... కీలక నేతపై కేసు
నన్ను చంపేందుకు వైసీపీ నేత ప్లాన్ చేశారు: కావ్యా కృష్ణారెడ్డి
Read Latest AP News and National News