Nara Lokesh about Balakrishna: చరిత్ర సృష్టించాలన్నా, తిరగ రాయాలన్నా బాలయ్యకే సాధ్యం: నారా లోకేష్
ABN , Publish Date - Aug 30 , 2025 | 08:02 PM
నటరత్న నందమూరి బాలకృష్ణ సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా ఏపీ విద్యాశాఖ మంత్రి, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ కూడా బాలయ్యకు అభినందనలు తెలియజేశారు.
నటరత్న నందమూరి బాలకృష్ణ సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా ఏపీ విద్యాశాఖ మంత్రి, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) కూడా బాలయ్యకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా బాలయ్యతో తనకున్న అనుబంధం గురించి ప్రస్తావించారు. బాలయ్య (Balakrishna) తనకు ముద్దుల మావయ్య అని పేర్కొన్నారు.
'మాస్ హీరో అయిన బాలకృష్ణ గారికి డైహార్ట్ ఫ్యాన్స్ ఉంటారు. బాలకృష్ణ గారు ఎప్పుడూ యంగ్ స్టర్. వారి ఎనర్జీ మాకు లేదు. ఆ సీక్రెట్ ఏంటో ఇప్పటి వరకు మాకు తెలియలేదు. రకరకాల జోనర్ల సినిమాలు, పాత్రల్లో నటించి మెప్పించటం బాలయ్యకే సాధ్యం. బాలయ్య బాబు నిర్మాతలు, దర్శకుల డ్రీమ్ హీరో. ప్రస్తుత ఓటిటి ఏరాలో కూడా బాలయ్య మెప్పిస్తున్నారు` అని లోకేష్ ప్రశంసించారు.
బాలయ్య బాబు భోళా మనిషి అని, మంచి మనస్సున్న మా మావయ్య అని లోకేష్ అన్నారు. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా ఒకేలా ఉండగలరని, ప్రజలకు అండగా నిలబడటంలో ముందుండే వ్యక్తి అని ప్రశంసించారు. బాలయ్య లాంటి వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో మరొకరు లేరని, బాలయ్య బాబు అన్ స్టాపబుల్ అని, తనకు ముద్దుల మావయ్యగా ఈ అవకాశం ఇచ్చిన బాలకృష్ణ గారికి ధన్యవాదాలని లోకేష్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇన్‌ఫార్మర్ నెపంతో గిరిజనుడి హత్య
గణేశుడి మండపం వద్ద కరెంట్ షాక్‌తో బాలుడి మృతి
Read Latest Telangana News and National News