Share News

Nara Lokesh: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్‌తో మంత్రి లోకేష్ భేటీ

ABN , Publish Date - Dec 15 , 2025 | 09:23 PM

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్‌తో ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ న్యూఢిల్లీలో సమావేశం అయ్యారు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాల పెంపు కోసం కూటమి ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి వివరించారు.

Nara Lokesh: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్‌తో మంత్రి లోకేష్ భేటీ
Nara Lokesh Dharmendra Pradhan meeting

ఢిల్లీ, డిసెంబర్ 15: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్‌తో ఏపీ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ న్యూఢిల్లీలో సమావేశం అయ్యారు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాల పెంపు కోసం కూటమి ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి వివరించారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు కనీస సామర్థ్యాలైన పఠన, గణన నైపుణ్యాలు సాధించేందుకు గ్యారెంటీడ్ ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.

Nara-lokesh-3.jpg


ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు పెంపొందించేందుకు క్లిక్కర్ ఆధారిత ఇంటరాక్టివ్ క్లాస్ రూమ్ రెస్పాన్స్ సిస్టమ్ ను ప్రవేశపెట్టామని కేంద్రమంత్రితో లోకేష్ వెల్లడించారు. చిన్న వయసులోనే రాజ్యాంగ హక్కులు, బాధ్యతల గురించి తెలియజేసేందుకు రాజ్యాంగ దినోత్సవం నాడు ‘ఆంధ్రప్రదేశ్ పాఠశాల శాసనసభ’ పేరుతో విద్యార్థుల మాక్ అసెంబ్లీ నిర్వహించామని చెప్పారు. బాలల భారత రాజ్యాంగాన్ని పుస్తక రూపంలో తీసుకువచ్చామని.. దేశంలోనే మొదటిసారిగా ప్రభుత్వ పాఠశాలలు స్వయంగా నిర్వహించే సెంట్రల్ స్మార్ట్ కిచెన్ ను కడపలో ప్రారంభించామని మంత్రి వివరించారు. విద్యా ప్రమాణాలు పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అభినందించారు.

Nara-lokesh-2.jpg


రాష్ట్రంలో విద్యా ప్రమాణాల పెంపునకు మద్దతుగా నిలవండి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 11 జవహర్ నవోదయ విద్యాలయాల(JNV) మంజూరుతో పాటు, రాష్ట్రానికి ఇటీవల కాలంలో కేంద్రం కేటాయించిన 12 కేంద్రీయ విద్యాలయాల(KV) ఏర్పాటు, కార్యాచరణకు చర్యలు తీసుకోవాలని కోరారు. సమగ్ర శిక్ష సంస్కరణల్లో భాగంగా స్టార్స్ ప్రాజెక్ట్ కింద రాష్ట్రానికి రూ.4,400 కోట్ల ఆర్థిక సాయం అందించి మద్దతుగా నిలవాలని కోరారు.

Nara-lokesh-1.jpg


2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన రూ.1,270 కోట్ల అదనపు నిధుల మంజూరుకు ఆమోదం తెలిపాలని, పీఎం పోషణ్ పథకం కింద పైలట్ ప్రాతిపదికన రాష్ట్రంలో 155 స్మార్ట్ కిచెన్ల ఏర్పాటుకు అనుమతించాలని నారా లోకేష్ కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో గుంటూరు జిల్లా చినకాకానిలో అభివృద్ధి చేసిన మోడల్ ఆటిజం సపోర్ట్ సెంటర్ ను ప్రారంభించాలని కేంద్ర ధర్మేంద్ర ప్రధాన్ ను ఈ సందర్భంగా మంత్రి లోకేష్ ఆహ్వానించారు. ఈ సమావేశంలో మంత్రి లోకేష్ వెంట కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, సహాయ మంత్రి పెమ్మసాని, ఎంపీలు పాల్గొన్నారు.

Nara-lokesh.jpg


ఇవి కూడా చదవండి..

నితిన్ నబీన్‌ను పార్టీ చీఫ్‌గా ప్రకటించక పోవడం వెనుక బీజేపీ వ్యూహం ఇదే

నియంత భయపడుతున్నారు... మమతపై బీజేపీ వివాదాస్పద పోస్టు

Updated Date - Dec 15 , 2025 | 09:23 PM