Share News

ప్రజలకు జగన్‌ క్షమాపణలు చెప్పాలి: ఎంపీ కలిశెట్టి

ABN , Publish Date - Feb 24 , 2025 | 04:38 AM

శాసనసభ సమావేశాలకు మాజీ సీఎం, పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్‌రెడ్డి హాజరవుతారని వైసీపీ నేతలు ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని...

ప్రజలకు జగన్‌ క్షమాపణలు చెప్పాలి: ఎంపీ కలిశెట్టి

విశాఖపట్నం, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): శాసనసభ సమావేశాలకు మాజీ సీఎం, పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్‌రెడ్డి హాజరవుతారని వైసీపీ నేతలు ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని, అయితే అసెంబ్లీ వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రజలకు ఆయనతోపాటు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు క్షమాపణలు చెప్పాలని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు డిమాండ్‌ చేశారు. ఆదివారం సాయంత్రం ఇక్కడ టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రాన్ని ఐదేళ్లు పాలించిన జగన్‌రెడ్డి.. ప్రకృతి వనరులను యఽథేచ్ఛగా దోపిడీ చేశారని, దీనిపై అసెంబ్లీలో క్షమాపణలు చెప్పాలన్నారు. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలకు అంతులేకుండా పోయిందని, ఈ ఇద్దరి అక్రమాలపై అసెంబ్లీలో చర్చించాలని ఆయన కోరారు.

Updated Date - Feb 24 , 2025 | 04:38 AM