Share News

Mock Drill Alert: యుద్ధం పై అప్రమత్తం

ABN , Publish Date - May 08 , 2025 | 03:46 AM

యుద్ధ వాతావరణం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండేందుకు విశాఖపట్నం, ఒంగోలు, బాపట్లలో మాక్‌ డ్రిల్స్‌ నిర్వహించి అధికారులు తక్షణ స్పందనను ప్రదర్శించారు. ఉగ్రదాడుల సమయంలో ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో, ప్రజలు మరియు ప్రభుత్వ విభాగాలు ఎలా ప్రతిస్పందించాలో శిక్షణ ఇచ్చారు

Mock Drill Alert: యుద్ధం పై అప్రమత్తం

  • విశాఖ, ఒంగోలు, బాపట్లలో మాక్‌ డ్రిల్‌

విశాఖపట్నం/బాపట్ల/ఒంగోలు క్రైం, మే 7(ఆంధ్రజ్యోతి): పాకిస్థాన్‌తో ప్రస్తుత యుద్ధ వాతావరణం సమయంలో ఊహించని విధంగా దాడు లు జరిగితే ఎలా తప్పించుకోవాలి..? ప్రాణాలు కాపాడుకోవడానికి ఏం చేయాలి..? అధికార యంత్రాంగం ఎలా స్పందిస్తుంది..? అన్నదానిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు బుధవారం విశాఖపట్నం, ఒంగోలు, బాపట్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు మాక్‌ డ్రిల్‌ నిర్వహించాయి. విశాఖపట్నంలో ఐదు వేర్వేరు ప్రాంతాల్లో మాక్‌ డ్రిల్‌ చేపట్టారు. జిల్లా కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌, నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చి పర్యవేక్షణలో వన్‌టౌన్‌ ఏరియాలోని రెండుచోట్ల మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. రాణీబొమ్మ సెంటర్‌లో జేఎం బక్షి సంస్థకు చెందిన భవనాలపై ఉగ్రవాదులు పొగబాంబులతో దాడులు చేసిన సన్నివేశాన్ని సృష్టించారు.


అగ్నిమాపక దళం మంటలను అదుపు చేయగా, ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది మాస్కులు ధరించి నిచ్చెన సాయంతో భవనంలోకి వెళ్లి అక్కడున్న ఉద్యోగులను కిందికి తీసుకువచ్చారు. అక్కడికి సమీపంలోని క్వీన్‌ మేరీ పాఠశాలలోనూ మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. ఉగ్రవాదులు పాఠశాలలోకి వస్తే ఏమి చేయాలనే దానిపై ఉపాధ్యాయులకు, విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. ఉదయం ఆంధ్ర విశ్వవిద్యాలయం మైదానంలో ఎన్‌సీసీ బృందాలు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ కలిసి మాక్‌ డ్రిల్‌ నిర్వహించాయి. వాల్తేరు రైల్వే డీఆర్‌ఎం కార్యాలయం, విశాఖపట్నం పోర్టులతో కేంద్ర ప్రభుత్వ బలగాలు మాక్‌ డ్రిల్‌ చేపట్టాయి. ఒంగోలులో రైల్వేస్టేషన్‌, బస్టాండ్‌తో పాటు ముఖ్యమైన ప్రాంతాలలో మాక్‌డ్రిల్‌ నిర్వహించారు. బాపట్ల రైల్వే స్టేషన్‌లో పోలీసులు మాక్‌డ్రిల్‌ చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పహల్గామ్ దాడిలో మరో కుట్ర..

ఆపరేషన్ సింధూర్‌పై చిరంజీవి ట్వీట్

ఎమర్జెన్సీ ప్రకటించిన పాకిస్తాన్..

For More AP News and Telugu News

Updated Date - May 08 , 2025 | 03:46 AM