Share News

‘టీచర్ల’ జీతాల సమస్య పరిష్కరిస్తాం: ఫరూక్‌

ABN , Publish Date - Jan 29 , 2025 | 06:17 AM

ఉపాధ్యాయులకు పెండింగ్‌ వేతనాల చెల్లింపు సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని పేర్కొన్నారు.

‘టీచర్ల’ జీతాల సమస్య పరిష్కరిస్తాం: ఫరూక్‌

అమరావతి, జనవరి 28(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని మదర్సాల్లో సర్వశిక్ష అభియాన్‌కు అనుబంధంగా విద్యా బోధన చేసిన ఉపాధ్యాయులకు పెండింగ్‌ వేతనాల చెల్లింపు సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని పేర్కొన్నారు. మదర్సాల్లో సామాన్య, సాంఘికశాస్త్రం బోధించే ఉపాధాయులు మంగళవారం అమరావతి సచివాలయంలో మంత్రిని కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. గత ఐదు సంవత్సరాలుగా తమకు జీతాలు ఇవ్వలేదని, ఆర్థిక సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.

సంక్షేమంపై సమష్టిగా ముందుకు: మంత్రులు

కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు, వాటిపై ప్రజల అభిప్రాయాలు, సంతృప్తి తదితరాల గురించి మైనార్టీ, బీసీ, సాంఘిక సంక్షేమశాఖల మంత్రులు చర్చించారు. మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌, బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి మంగళవారమిక్కడ సమావేశమయ్యారు. చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం తీసుకుంటు న్న చర్యలు క్షేత్రస్థాయిలో ప్రజల చెంతకు చేరే విధంగా సమష్టిగా ముం దుకు సాగాల్సిన అవసరం ఉందని మంత్రులు అభిప్రాయపడ్డారు.

Updated Date - Jan 29 , 2025 | 06:17 AM