Minister Savita : పెట్టుబడులకు ఏపీ అనుకూలం
ABN , Publish Date - Feb 17 , 2025 | 03:54 AM
చేనేతరంగ అభివృద్ధికి సీఎం చంద్రబాబు టెక్స్‌టైల్ పాలసీ తీసుకొచ్చారని, పెట్టుబడులకు రాష్ట్రం అనువైన ప్రాంతమని బీసీ సంక్షేమ, చేనేత జౌళ్ల శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు.

చేనేతరంగ అభివృద్ధికి టెక్స్‌టైల్ పాలసీ
దేశ, విదేశీ పారిశ్రామికవేత్తలతో మంత్రి సవిత
అమరావతి, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో చేనేతరంగ అభివృద్ధికి సీఎం చంద్రబాబు టెక్స్‌టైల్ పాలసీ తీసుకొచ్చారని, పెట్టుబడులకు రాష్ట్రం అనువైన ప్రాంతమని బీసీ సంక్షేమ, చేనేత జౌళ్ల శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ భారత్ టెక్స్-2025 కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి.. దేశ విదేశాలకు చెందిన పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు తక్షణ అనుమతులు, రాయితీలు ఇవ్వడంతో పాటు భూకేటాయింపులు, ఇతర మౌలిక వసతుల కల్పనకు చంద్రబాబు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందన్నారు. ప్రపంచంలోనే మేలైన పట్టు, చేనేత వస్త్రాలు తమ రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్నాయని, వాటి మార్కెటింగ్‌కు రాష్ట్రంతో పాటు దేశంలోని పలు నగరాల్లో చేనేత ఎగ్జిబిషన్లు, ఎక్స్‌పోలు నిర్వహిస్తున్న తెలిపారు. నేతన్నలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ వారికి 365 రోజుల పని కల్పించే లక్ష్యంతో టెక్స్‌టైల్ పార్కులు, వీవర్ శాలలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి చెప్పారు. నూలు కొనుగోలుపై 15 శాతం మేర రారుతీ అందిస్తున్నామన్నారు. చేనేత వస్త్రాల వినియోగంపై పెరుగుతున్న మక్కువను దృష్టిలో పెట్టుకుని అమెజాన్, మింత్రా, ఫ్లిప్‌కార్ట్, జియోమార్ట్ వంటి ఏడు ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో 20 ఆప్కో షోరూమ్‌ల ద్వారా డోర్ డెలివరీ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. కార్యక్రమంలో ఏపీ చేనేత జౌళిశాఖ కమిషనర్ రేఖారాణి, ఆప్కో ఎండీ పావనమూర్తి పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Minister Nara Lokesh: ప్రయాగ్ రాజ్‌కు మంత్రి నారా లోకేశ్.. షెడ్యూల్ ఇదే..
Road Accident: దారుణం.. నిర్లక్ష్యంగా బస్సు నడిపిన డ్రైవర్.. చివరికి బాలుడి పరిస్థితి..