Share News

Minister Narayana : పెండింగ్‌ టీడీఆర్‌ బాండ్లను వెంటనే ఇవ్వండి

ABN , Publish Date - Jan 04 , 2025 | 06:42 AM

రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వెరిఫికేషన్‌ పూర్తి చేసి పెండింగ్‌లో ఉన్న టీడీఆర్‌ బాండ్లను లబ్ధిదారులకు అందించాలని మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు.

Minister Narayana : పెండింగ్‌ టీడీఆర్‌ బాండ్లను వెంటనే ఇవ్వండి

  • మంత్రి నారాయణ ఆదేశాలు

అమరావతి, జనవరి 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వెరిఫికేషన్‌ పూర్తి చేసి పెండింగ్‌లో ఉన్న టీడీఆర్‌ బాండ్లను లబ్ధిదారులకు అందించాలని మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. టీడీఆర్‌ బాండ్లపై మున్సిపల్‌ కమిషనర్లు, యూడీఏల అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో పలు మున్సిపాలిటీల్లో టీడీఆర్‌ బాండ్లలో భారీ అక్రమాలు జరిగాయన్నారు. అవకతవకలు జరిగిన బాండ్లు మినహా మిగతా బాండ్లను రిలీజ్‌ చేయాలని ఆదేశాలిచ్చారు. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న జారీ చేయాల్సిన టీడీఆర్‌ బాండ్లు 437 ఉన్నాయి. వీటిని శుక్రవారం రాత్రి లోగా ఆన్‌లైన్‌లో లబ్ధిదారులకు జారీచేయాలని మంత్రి ఆదేశించారు.

Updated Date - Jan 04 , 2025 | 06:42 AM