Share News

Minister Lokesh: జగన్‌రెడ్డీ... ఉర్సాపై ఆరోపణలు నిరూపించు లేదా క్షమాపణ చెప్పు

ABN , Publish Date - Jun 03 , 2025 | 03:08 AM

మంత్రులు లోకేశ్ మాజీ సీఎం జగన్ పై ఉర్సా కంపెనీకి భూమి కేటాయింపు ఆరోపణలను నిరూపించాలని డిమాండ్ చేశారు. నిరూపించకపోతే క్షమాపణ చెప్పాలని, తమను రాజీనామా చేస్తామని చెప్పారు.

Minister Lokesh: జగన్‌రెడ్డీ... ఉర్సాపై ఆరోపణలు నిరూపించు లేదా క్షమాపణ చెప్పు

  • నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా: మంత్రి లోకేశ్‌

అమరావతి, జూన్‌ 2(ఆంధ్రజ్యోతి): ‘ఉర్సా కంపెనీకి విశాఖలో ఎకరా రూపాయికే భూమి కేటాయించామన్న మాజీ సీఎం జగన్‌ తన ఆరోపణలను నిరూపించాలి. లేకపోతే యువతకు క్షమాపణ చెప్పాలి’ అని మంత్రి లోకేశ్‌ డిమాండ్‌ చేశారు. ఈమేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘జగన్‌ ఆరోపణలు నిరూపిస్తే నేను నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా. ఐదేళ్ల వైసీపీ విధ్వంస పాలనలో ఒక్క కంపెనీ తీసుకురాకపోగా ఉన్న కంపెనీలను ఇతర రాష్ట్రాలకు తరిమేశారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా మేం కంపెనీలను ఆహ్వానిస్తూ, పెట్టుబడులను తీసుకొస్తుంటే తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదు. రాష్ట్ర యువతకు మంచి ఉద్యోగాలు వస్తుంటే చూసి జగన్‌ తట్టుకోలేకపోతున్నారు. ఈనో వాడితే కాస్త రిలీఫ్‌ వస్తుంది’ అని లోకేశ్‌ ఎద్దేవా చేశారు.

Updated Date - Jun 03 , 2025 | 08:38 AM