Share News

Minister Kandula Durgesh : పీ4 విధానంలో పర్యాటకాభివృద్ధి

ABN , Publish Date - Jan 27 , 2025 | 05:17 AM

విశాఖపట్నం నోవాటెల్‌ హోటల్‌లో సోమవారం టూరిజం రీజినల్‌ కాన్‌క్లేవ్‌ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ నిర్వహిస్తున్నా మన్నారు.

Minister Kandula Durgesh : పీ4 విధానంలో పర్యాటకాభివృద్ధి

  • నేడు విశాఖలో రీజినల్‌ కాన్‌క్లేవ్‌

  • ఫిబ్రవరిలో టూరిజం ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌

  • ‘సింగిల్‌ విండో’లో ఇన్వెస్టర్లకు అనుమతులు

  • అమరావతిలో రూ.500కోట్లతో రివర్‌ఫ్రంట్‌ అభివృద్ధి

  • వచ్చే పుష్కరాల నాటికి అఖండ గోదావరి ప్రాజెక్టుకు రూపు.. ఈ వారంలోనే టెండర్లు

  • పర్యాటక మంత్రి కందుల దుర్గేష్‌

రాజమహేంద్రవరం, జనవరి 26(ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి పబ్లిక్‌, ప్రైవేట్‌, పీపుల్స్‌ పార్టనర్‌ షిప్‌ (పీ4) విధానంలో పనులు చేపట్టనున్నట్టు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. విశాఖపట్నం నోవాటెల్‌ హోటల్‌లో సోమవారం టూరిజం రీజినల్‌ కాన్‌క్లేవ్‌ నిర్వహిస్తున్నా మన్నారు. విశాఖ సమావేశానికి ఉత్తరాంధ్ర ఐదు జిల్లాల నుంచి ఆసక్తి ఉన్నవారు రావచ్చని.. ఇప్పటికే 150మందికి ఆహ్వానం అందిందన్నారు. సుమారు 15 మంది ఇప్పటికే ఎంవోయు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా ఇటువంటివి నిర్వహించి పర్యాటక రంగంలో పెట్టుబడి పెట్టే ఆసక్తి ఉన్నవాళ్లను ఆహ్వానిస్తామన్నారు. అలాగే ఫిబ్రవరిలో టూరిజం ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ నిర్వహించనున్నట్టు చెప్పారు. ఇన్వెస్టర్లకు సింగిల్‌ విండో విధానంలో అనుమతులు ఇస్తామన్నారు. ఇప్పటికే తాజ్‌, ఒబెరాయ్‌, మేఫేర్‌, ఐఆర్‌ సిటీసీ తదితర సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయని, ఐఆర్‌సీటీసీతో ఇప్పటికే ఎంవోయూ కుదిరిందని చెప్పారు. ఒబెరాయ్‌ సంస్థ ఐదు ప్రాంతాల్లో హోటల్‌ బిజినె్‌సకు ముందుకొచ్చిందన్నారు. ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీని ఆనుకుని ఉన్న పిచ్చుకలంకను ఇప్పటికే సందర్శించారని, త్వరలో నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. మలేషియా, కెనడా వంటి దేశాల్లోనూ సమావేశాలు నిర్వహించనున్నట్టు తెలిపారు.


త్వరలో మారేడుమిల్లి ఉత్సవ్‌

త్వరలో ఏజెన్సీలోని మారేడుమిల్లి ఉత్సవ్‌ నిర్వహించి ఇక్కడి అవకాశాలను ఇన్వెస్టర్లకు తెలిపి మారేడుమిల్లి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి దుర్గేష్‌ తెలిపారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు ఓ సబ్‌కమిటీని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. పాపికొండల పర్యటనలో భద్రత ఏర్పాట్లు కట్టుదిట్టం చేస్తున్నామన్నారు. అమరావతిలో రూ.500 కోట్లతో రివర్‌ఫ్రంట్‌ అభివృద్ధిచేసి పర్యాటక కేంద్రంగా మార్చడానికి సీఎం చంద్రబాబు అంగీకరించారన్నారు. టూరిజం సర్క్యూట్‌లు, యాంకర్‌ హబ్‌లకు కేంద్రంగా ఏపీ రూపొందనుందని, అడ్వెంచర్‌, ఎకో, వెల్‌నెస్‌, హెరిటేజ్‌, రలీజియస్‌, అగ్రి, మెడికల్‌, క్రూయిజ్‌, బీచ్‌, టెంపుల్‌ టూరిజంను వృద్ధి చేస్తామని చెప్పారు. ఈ వారంలోనే అఖండ గోదావరి ప్రాజెక్టుకు టెండర్లు పిలుస్తున్నామని తెలిపారు. రూ.98 కోట్లతో రాజమహేంద్రవరంలో ఈ ప్రాజెక్టును పుష్కరాల నాటికి అభివృద్ధి చేస్తామన్నారు. గోదావరి హేవలాక్‌ బ్రిడ్జి 2.7 కిలోమీటర్ల మేర 57 స్పాన్‌లను ఒక్కొక్కటి 48 మీటర్ల విస్తీర్ణంలో అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి తెలిపారు. అన్ని ఘాట్లనూ కలిపేలా బోటింగ్‌ ఏర్పాటుచేస్తున్నట్టు చెప్పారు. చరిత్రాత్మకమైన గండికోటను ఆధునికీకరించనున్నామని, డీపీఆర్‌లు కేంద్రానికి పంపామని చెప్పారు. రూ.100 కోట్లతో సూర్యలంక బీచ్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. స్వదేశీ దర్శన్‌ -2 ప్రాజెక్టుకు డీపీఆర్‌ పంపించామన్నారు. పర్యాటక రంగాన్ని కూడా పరిశ్రమగా మార్చి అన్నిరకాల రాయితీలు ఇస్తున్నట్టు మంత్రి చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి

Vijayasai Reddy: విజయసాయిరెడ్డి భవిష్యత్తు ప్లాన్ ఇదేనా..!

Republic Day.. ఏపీలో రిపబ్లిక్ వేడుకలు.. అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర సన్నివేశం..

Republic Day.. బీజేపీకి రాజ్యాంగం అంటే గౌరవం లేదు: వైఎస్ షర్మిల

Updated Date - Jan 27 , 2025 | 05:18 AM