Share News

Medical Student : వైద్యుడవ్వాలనే కల కరిగిపోయింది!

ABN , Publish Date - Feb 12 , 2025 | 04:48 AM

కాకినాడ రంగరాయ మెడికల్‌ కళాశాలలో వైద్య విద్యార్థి ఉరి వేసుకుని తనువు చాలించాడు.

Medical Student : వైద్యుడవ్వాలనే కల కరిగిపోయింది!

  • కాకినాడ రంగరాయలో వైద్య విద్యార్థి బలవన్మరణం

  • శోక సంద్రంలో కుటుంబ సభ్యులు

  • కారణం తెలీక కన్నీరుమున్నీరు

కాకినాడ క్రైం, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): కాకినాడ రంగరాయ మెడికల్‌ కళాశాలలో వైద్య విద్యార్థి ఉరి వేసుకుని తనువు చాలించాడు. పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం బాడవ గ్రామానికి చెందిన రావూరి సుబ్రహ్మణ్యం, మహాలక్ష్మి దంపతుల కుమారుడు రావూరి సాయిరామ్‌(22) ఆర్‌ఎంసీలో ఎంబీబీఎస్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. చిన్నప్పటినుంచీ మెరిట్‌ స్టూడెంట్‌గా రాణిస్తూ ఎంబీబీఎస్‌లో ఫ్రీ సీట్‌ సాధించాడు. సోమవారం అర్ధరాత్రి 1.30 గంట సమయంలో ఆర్‌ఎంసీ మెన్స్‌ హాస్టల్లో తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని సాయిరామ్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సహచర విద్యార్థులు సీపీఆర్‌ చేసినా చలనం లేకపోవడంతో స్థానిక ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. చదువు ఒత్తిడి తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడా లేక ప్రేమ వ్యవహారమా అనే కోణాల్లో పోలీసులు ఆరా తీస్తున్నారు.

Updated Date - Feb 12 , 2025 | 04:48 AM