Share News

Andhra Pradesh: వరదను ఎదురీది.. అదృష్ట జాతకుడు..!

ABN , Publish Date - Aug 09 , 2025 | 02:10 PM

వరద ప్రవాహాన్ని అంచనా వేయకుండా బైక్ పై చప్టా దాటుతుండగా జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు. అతడికి ఈత రావడంతోపాటు, పోలీసులు సకాలంలో తాడు అందించంతో ఒడ్డుకు చేరుకుని ప్రాణాలు దక్కించుకున్నాడు. గత రాత్రి ఎగువన కురిసిన వర్షానికి దాములూరు-వైరా కట్టలేరుకు భారీగా వరద నీరు చేరింది.

Andhra Pradesh: వరదను ఎదురీది.. అదృష్ట జాతకుడు..!
Kattaleru Vagu

  • కట్టలేరులో కొట్టుకుపోయి..

  • ప్రాణాలు దక్కించుకుని..

  • అన్నవరం వాసికి తాడు అందించి రక్షించిన పోలీసులు

వీరులపాడు: వరద ప్రవాహాన్ని అంచనా వేయకుండా బైక్ పై చప్టా దాటుతుండగా జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు. అతడికి ఈత రావడంతోపాటు, పోలీసులు సకాలంలో తాడు అందించంతో ఒడ్డుకు చేరుకుని ప్రాణాలు దక్కించుకున్నాడు. గత రాత్రి ఎగువన కురిసిన వర్షానికి దాములూరు-వైరా కట్టలేరుకు భారీగా వరద నీరు చేరింది. ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం పల్లంపల్లి, నందిగామ మండలం కూడెలి, దాములూరు మధ్య ఉన్న చప్టాను వీరులపాడు మండలం వి.అన్నవరానికి చెందిన దొండపాటి పాపారావు శుక్రవారం మధ్యాహ్నం ద్విచక్రవాహనం దాటే ప్రయత్నం చేశాడు. అయితే, వరద ఉధృతికి బైకు కొట్టుకుపోగా అతడు ఈదుకుంటూ ఓ చెట్టుకొమ్మను పట్టుకొన్నాడు. విషయం తెలుసుకున్న వీరులపాడు పోలీసులు అక్కడకు చేరుకొని తాళ్ల సాయంతో అతడ్ని క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. పాపారావు మోటార్ బైక్, రూ.25 వేలు నగదు, సెల్‌ఫోన్ వరదలో కొట్టుకుపోయాయి. సకాలంలో పోలీసులు సాయమందించడంతో బయటపడగలిగారు.


Also Read:

దారుణంగా అవమానించి.. ఇప్పుడు సారీ చెబుతోంది..

ఓట్ల గోల్‌మాల్‌పై శరద్ పవార్ సీరియస్..ఈసీకి సూచన

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Aug 09 , 2025 | 02:10 PM