Share News

LPG Price Hike October 2025: గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయ్..!

ABN , Publish Date - Oct 01 , 2025 | 01:50 PM

ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు నిర్వహిస్తున్న ఇంధన ధరల సాధారణ నెలవారీ సమీక్షలో భాగంగా ఈ నెల(అక్టోబర్ 1, 2025)న సవరణలు జరిగాయి. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా వంట గ్యాస్ ధరలు ఇలా ఉన్నాయి.

LPG Price Hike October 2025: గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయ్..!
LPG price hike

ఇంటర్నెట్ డెస్క్: ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు నిర్వహిస్తున్న ఇంధన ధరల సాధారణ నెలవారీ సమీక్షలో భాగంగా ఈ నెల (అక్టోబర్ 1, 2025)న సవరణలు జరిగాయి. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.15.50 పెరిగింది. దీంతో ధర ఇప్పుడు రూ.1,595.50గా ఉంది. ఇది గతంలో రూ.1,580గా ఉండేది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) కిలోలీటరుకు రూ.3,052.50కు పెరిగింది. డొమెస్టిక్‌ ఎల్‌పీజీ సిలిండర్ల ధరలలో మార్పు లేదు.


దేశంలోని ప్రధాన నగరాల్లో వంట గ్యాస్ ధర రూ.850 నుంచి రూ.960 వరకు ఉంది. కొన్ని ప్రధాన నగరాల్లో 14 కిలోల LPG సిలిండర్ల ధరలు ఇలా ఉన్నాయి.

  • ఢిల్లీ- రూ.853.

  • ముంబై- రూ.852.50

  • హైదరాబాద్‌- రూ.905

  • వరంగల్- రూ.924

  • విశాఖపట్నం- రూ.861

  • విజయవాడ- రూ.875

కమర్షియల్ ఎల్‌పీజీ ధరలు (19 కిలోల సిలిండర్)

  • ఢిల్లీ- రూ.1,595.50

  • కోల్‌కతా- రూ.1,700.50

  • ముంబై- రూ.1,547.00

  • చెన్నై- రూ.1,754.50


ఇవి కూడా చదవండి..

బిహార్ ఓటర్ల తుది జాబితా విడుదల చేసిన ఈసీ

26/11 దాడుల తర్వాత పాక్‌తో యుద్ధం వద్దని చెప్పిన ఆమెరికా.. చిదంబరం వెల్లడి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 01 , 2025 | 03:37 PM