Share News

Liquor Scam: లిక్కర్ స్కామ్‌లో నిందితులు.. సిట్ కస్టడీపై నేడు కోర్టు నిర్ణయం

ABN , Publish Date - May 29 , 2025 | 09:12 AM

లిక్కర్ స్కామ్‌లో నిందితులను తమ కస్టడీకి అప్పగించాలంటూ ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై వాదనలు ఇప్పటికే పూర్తయ్యాయి. దీనిపై ఏసీబీ కోర్టు తీర్పును రోజు వెలువరించనుంది.

Liquor Scam: లిక్కర్ స్కామ్‌లో నిందితులు.. సిట్ కస్టడీపై నేడు కోర్టు నిర్ణయం

విజయవాడ, మే 29: లిక్కర్ స్కామ్ కేసులో నిందితులను తమ కస్టడీకి అప్పగించాలంటూ సిట్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌పై ఏసీబీ కోర్టు గురువారం తీర్పు వెలువరించనుంది. ఈ కేసులో నిందితులు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని మూడు రోజులు.. అలాగే ధనుంజయ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలను వారం రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలంటూ సిట్ అధికారులు గతంలో ఏసీబీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. వీరి కస్టడీ పిటిషన్‌పై సోమవారం వాదనలు పూర్తయ్యాయి. దీంతో ఆ రోజు సాయంత్రం తీర్పు వెలువరిస్తామని ఏసీబీ కోర్టు స్పష్టం చేసింది. కానీ ఈ సిట్ వేసిన పిటిషన్‌పై మే 29వ తేదీన తీర్పు వెలువరిస్తామని ఏసీబీ కోర్టు స్పష్టం చేసింది. దీంతో ఈ రోజు వీరిని సిట్ అధికారుల కస్టడీపై కోర్టు తీర్పు ఇవ్వనుంది.


జగన్ ప్రభుత్వ హయాంలో పాత బ్రాండ్లను పక్కన పెట్టి.. జే బ్రాండ్లను అందుబాటులోకి తీసుకు వచ్చింది. దీంతో ఈ మద్యం తాగి చాలా మంది అనారోగ్యం పాలైయ్యారు. అంతేకాదు..వందలాది మంది మరణించారు. అదీకాక ఈ మద్యం విక్రయాలన్నీ అన్‌లైన్ చెల్లింపుల్లో కాకుండా.. నగదు రూపంలో జరిగాయి. ఈ నేపథ్యంలో ఈ మద్యం తయారీ, విక్రయాలపై ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. ఈ మద్యం కుంభకోణంపై దర్యాప్తు చేయిస్తామని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు.


2024లో జరిగిన ఎన్నికల్లో కూటమికి ఓటరు పట్టం కట్టాడు. దీంతో చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. అనంతరం ఈ మద్యం వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని తొలుత అరెస్ట్ చేశారు. అతడు చెప్పిన వివరాలు ఆధారంగా విశ్రాంతి ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, మాజీ సీఎం వైఎస్ జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిలతోపాటు బాలాజీ గోవిందప్పను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని తమ విచారణకు అప్పగించాలంటూ సిట్ అధికారులు కోర్టును ఆశ్రయించారు. అయితే ఇప్పటికే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని సిట్ అధికారులు ఒకసారి కస్టడీకి తీసుకుని విచారించిన సంగతి తెలిసిందే. మరోసారి అతడిని తమ కస్టడీకి అప్పగించాలంటూ సిట్ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి..

నేటి నుంచి మరో కొత్త పథకం

భారీ వర్షాలు.. అధికారులను అప్రమత్తం చేసిన ప్రభుత్వం

For AndhraPradesh News And Telugu News

Updated Date - May 29 , 2025 | 09:13 AM