అర్హులందరికీ సంక్షేమ పథకాలు
ABN , Publish Date - Nov 28 , 2025 | 12:06 AM
నకు ఓటు వేయని వారికి కూడా తాను ఎమ్మెల్యేను అని, అర్హులైన ప్రతిపక్ష నాయకులకు కూడా ప్రభుత్వ పథకాలు అందజేస్తామని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. వెంకటగిరి గ్రామంలో గురువారం రైతన్నా మీకోసం- అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఎమ్మిగనూరు రూరల్, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): తనకు ఓటు వేయని వారికి కూడా తాను ఎమ్మెల్యేను అని, అర్హులైన ప్రతిపక్ష నాయకులకు కూడా ప్రభుత్వ పథకాలు అందజేస్తామని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. వెంకటగిరి గ్రామంలో గురువారం రైతన్నా మీకోసం- అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే గ్రామంలోని ప్రజలను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ వెంకటగిరి గ్రామంలో గత వైసీపీ పాలకులు అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం చేశారన్నారు. గ్రామానికి నడిచేందుకు కూడా రోడ్డు లేకపోవడంతో ప్రధాన రహదారి వేసినట్లు తెలిపారు. గ్రామంలో సీసీ రోడ్లు, తాగునీటి సమస్య పరిష్కారం కోసం కృషి చేశామన్నారు. అయినప్పటికీ వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. కార్యక్రమంలో అబ్జర్‌వర్ టిప్పుసుల్తాన్, మండల కన్వినర్ కె.టి వెంకటేశ్వర్లు, మార్కెట్ యార్డు చైర్మన్ మల్లయ్య, కొటేకల్ జగదీష్, గ్రామ నాయకులు వీరప్పనాయుడు, కోటా నరసింహయాదవ్, శేకన్న యాదవ్, బోయ పరమేష్, వెంకటేష్, వీరాంజనేయులు, గంగాధర్, రామానాయుడు, నరేంద్ర, బత్తిని నాగరాజు లతో పాటు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
కడిమెట్ల గ్రామానికి బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి తెలిపారు. గురువారం తమ గ్రామానికి బస్సును ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరడంతో తక్షణమే స్పందించిన ఆయన ఆర్టీసి డీఎంతో ఫోన్‌లో మాట్లాడారు. దీంతో విద్యార్థులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
కోసిగి: ఇది రైతు ప్రభుత్వం అని టీడీపీ ఇన్‌చార్జి రాఘవేంద్ర రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతన్నా మీకోసం కార్యక్రమంలో భాగంగా గురువారం కామన్‌దొడ్డి గ్రామంలో రైతుల ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం అందిస్తున్న పథకాలను రైతులకు వివరించారు. వ్యవసాయ శాఖ ఏడీ బాలవర్దిని రాజు, ఏవో వరప్రసాద్ ఆధ్వర్యంలో రైతన్న మీకోసం కార్యక్రమం నిర్వహించారు. రాఘవేంద్రరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం గ్రామంలోని చావిడి వద్ద రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని, రసాయన ఎరువులు తగ్గించి ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించాలని, తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించి రైతులు లాభాలు పొందాలన్నారు. అలాగే నీటిభద్రత, డిమాండ్ ఆధారిత పంటలు పండించడం, వ్యవసాయంలో టెక్నాలజీని ఉపయోగించడం వంటి విలువైన విషయాలను రైతులకు తెలియజేశారు. టీడీపీ నాయకులు రాజారెడ్డి, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు ముత్తురెడ్డి, మండల అధ్యక్షుడు పల్లెపాడు రామిరెడ్డి, మార్కెట్ యార్డు చైర్మన్ నర్సారెడ్డి, సింగిల్ విండో చైర్మన్ నాడిగేని అయ్యన్న, మాజీ జడ్పీటీసీలు తోవి రామకృష్ణ, జక్కనగేని వెంకటేశ్, వక్రాణి వెంకటేశ్, జ్ఞానేష్, అనంతసేనా రెడ్డి, ఈరన్న, దొడ్డయ్య, ఈరేష్, మామల్లి వీరేష్, సొట్టయ్య, గౌస్, కోసిగయ్య, వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.