Srisailam Temple Tragedy: మహాశివరాత్రి వేళ విషాదం.. పుణ్యస్నానాలకు వెళ్లి..
ABN , Publish Date - Feb 26 , 2025 | 09:25 AM
మహాశివరాత్రి వేళ ఘోర విషాదం చోటు చేసుకుంది. శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్లిన భక్తులు ప్రమాదానికి గురయ్యారు.

నంద్యాల: శ్రీశైలంలో తీవ్ర విషాదం నెలకొంది. దర్శనానికి వెళ్లిన ముగ్గురు భక్తులు ప్రమాదానికి గురయ్యారు. మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వేకువజాము నుంచే భక్తులు పెద్దఎత్తున పోటెత్తుతున్నారు. పుణ్యస్నానాలు ఆచరించి భక్తిశ్రద్ధలతో స్వామి, అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ముగ్గురు స్నేహితులు దర్మనానికి వెళ్లారు. అనంతరం లింగాలగట్టు వద్ద స్నానాలు చేసేందుకు నీటిలోకి దిగారు.
Army plane crash: ఆ దేశంలో ఘోర ప్రమాదం.. కళ్లుమూసి తెరిచే లోపే..
అయితే స్నానం చేస్తూ కొంచెం లోపలికి వెళ్లడంతో ఈత రాక ఒకరు ముగిపోయారు. స్నేహితుడిని కాపాడేందుకు వెళ్లిన మిగతా ఇద్దరూ గల్లంతయ్యారు. ప్రమాదాన్ని గమనించిన తోటి భక్తులు సమాచారాన్ని వెంటనే స్థానిక అధికారులు అందించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు భక్తులను కాపాడేందుకు చర్యలు చేపట్టారు. గజఈతగాళ్లు రంగంలోకి దింపారు. నది మెుత్తం జల్లెడపడుతూ గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, పండగ వేళ భక్తులకు ప్రమాదం జరగడంతో శ్రీశైలం ఆలయ పరిసరాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
KSRTC bus conductor: కర్ణాటక, మహారాష్ట్ర మధ్య తిరగని సర్వీసులు
Gold and Silver Prices Today: గుడ్ న్యూస్.. భారీగా పతనమైన బంగారం ధరలు..