మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను ఆపాలి
ABN , Publish Date - Oct 23 , 2025 | 11:34 PM
ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటీకణ చేయడం తక్షణమే ఆపాలని వైసీపీ ఎమ్మిగనూరు ఇన్‌చార్జి బుట్టా రేణుక డిమాండ్ చేశారు.
ఎమ్మిగనూరు టౌన్, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటీకణ చేయడం తక్షణమే ఆపాలని వైసీపీ ఎమ్మిగనూరు ఇన్‌చార్జి బుట్టా రేణుక డిమాండ్ చేశారు. పట్టణంలోని శిల్పా ఎస్టేట్‌లోని వైసీపీ కార్యాలయంలో కోటి సంతకాల సేకరణ పుస్తకాలు విడుదల సందర్భంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోని వైద్య, విద్య రంగం ప్రైవేట్ పరం చేయాలనే ఉద్దేశ్యంతో కూటమి ప్రభుత్వం పీ4 విధానంలో ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని చూస్తోందన్నారు. వైఎస్ జగన్ 17 మెడికల్ కళాశాలలో 5 మెడికల్ కళాశాలలను ప్రారంభించి వైద్య విద్య, వైద్యం సామాన్యులకు చేరేలా చేస్తే, కూటమి ప్రభుత్వం పేదల ప్రజలకు వాటిని అందకుండా ప్రైవేట్ వ్యవస్థలకు అప్పజెప్పడం దారుణమన్నారు. ఈ దారుణాన్ని రచ్చబండ కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రభుత్వ మెడికల్ కళాశాలల వల్ల యువతకు లభించే అవకాశాలు, వైద్య సదుపాయాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని పార్టీ నాయకులకు సూచించారు. ప్రజలకు తెలియజేయడంతో పాటు ప్రజలతో సంతకాల సేకరణ చేస్తే గవర్నర్‌కు వైఎస్ జగన్ అందజేస్తారని చెప్పారు. వైసీపీ నాయకులు నీలకంఠప్ప, బషిరెడ్డి, మురహరి రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్, నరసింహులు, విరూపాక్షిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.