Share News

సమస్యల పరిష్కారానికి చర్యలు: ఎమ్మెల్యే

ABN , Publish Date - Dec 16 , 2025 | 12:08 AM

ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు.

 సమస్యల పరిష్కారానికి చర్యలు: ఎమ్మెల్యే
దివ్యాంగుడి సమస్యలు వింటున్న ఎమ్మెల్యే

ఎమ్మిగనూరు, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. పట్టణంలోని కుర్ణి కమ్యునిటీ హాల్‌లో సోమవారం నందవరం మండలానికి సంబంధించి ప్రజాదర్బార్‌ నిర్వహించారు. ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యేకు విన్నివించారు. మండలం నుంచి దాదాపు 120పైగా వినతులు వచ్చాయి. ఇందులో ప్రధానంగా కొత్తపెన్షన్లు, ఇళ్లస్థలాలు, ఇళ్లు, గ్రామాల్లో సీసీ రోడ్లు, తాగునీరు, హాలహర్వి నుంచి నందవరం వరకు బీటీ రోడ్డు వంటి సమస్యలపై ఆయా గ్రామనాయకులు, ప్రజలు ఎమ్మెల్యేకు అర్జీలు ఇచ్చారు. అలాగే ముగతి గ్రామానికి చెందిన మహబూబ్‌ బాషా వేదిక ఎక్కేందుకు చేతకాకపోవటంతో ఎమ్మెల్యే ఆయన దగ్గరకు వచ్చి వినతిపత్రం స్వీకరించారు. గతంలో విద్యుత్‌ స్తంభం నుంచి కిందపడి తీవ్రంగా గాయపడి దివ్యాంగుడిని అయ్యాయని, అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఆదుకోలేదని తెలిపారు. నందవరం పీఏసీ చైర్మన్‌ ధర్మాపురం గోపాల్‌, మార్కెట్‌ యార్డు చైర్మన్‌ మల్లయ్య, బీసీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ చిన్నరాముడు, మండల నాయకులు కాశీం వలి, రైస్‌మిల్లు నారాయణ రెడ్డి, వెంకటరామిరెడ్డి, నాగలదిన్నె ఈరన్న, బ్రహ్మనందరెడ్డి భార్గవ్‌, వీరేష్‌, భాస్కర్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 16 , 2025 | 12:08 AM