గ్రామీణ రోడ్లకు మహర్దశ
ABN , Publish Date - Dec 26 , 2025 | 01:15 AM
కూటమి ప్రభుత్వంలోనే రోడ్లకు మహర్దశ వచ్చిందని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు.
మహానంది, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వంలోనే రోడ్లకు మహర్దశ వచ్చిందని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు. మండలంలోని మసీదుపురం హైవే నుంచి గ్రామం 2 కిలో మీటర్ల వరకు నాబార్డు నిధులు రూ.90 లక్షలతో నిర్మించిన బీటీ రోడ్డును గురువారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారని, అయితే ప్రభుత్వం సమస్యలను పరిష్కరిస్తూ వస్తోందని అన్నారు. ఓ వైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే రాష్ట్రాభివృద్ధికి సీఎం చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. ప్రజలకు రాజకీయాలకు అతీతంగా అభివృద్ధికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో కేసీ కెనాల్ ప్రాజెక్ట్ చైర్మన్ బన్నూరి రామలింగారెడ్డి, పీఆర్ డీఈఈ మురహరిరావు, టీడీపీ క్లస్టర్ ఇన్‌చార్జి చంద్రమౌలీశ్వరరెడ్డి, నాయకులు శ్రీనివాసరెడ్డి, మహేశ్వర రెడ్డి, క్రాంతికుమార్ యాదవ్, ఉమాదేవి పాల్గొన్నారు.