Share News

CI Shankaraiah Dismissed: సీఐ శంకరయ్య విధుల నుంచి తొలగింపు

ABN , Publish Date - Nov 21 , 2025 | 09:22 PM

పులివెందుల మాజీ సీఐ శంకరయ్య డిస్మిస్ అయ్యారు. ఆయన్ను విధుల నుంచి తొలగిస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ ఆదేశాలు జారీ చేశారు.

CI Shankaraiah Dismissed: సీఐ శంకరయ్య విధుల నుంచి తొలగింపు
Pulivendula Former CI Shankaraiah

కర్నూలు, నవంబర్ 21: కడప జిల్లా పులివెందుల మాజీ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జె.శంకరయ్య(CI Shankaraiah) డిస్మిస్ అయ్యారు. ఆయన్ను విధుల నుంచి తొలగిస్తూ కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్(Kurnool Range DIG Koya Praveen) ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం వీఆర్‌లో ఉన్న శంకరయ్యను క్రమశిక్షణా చర్యల్లో భాగంగా డీఐజీ ఆదేశాల మేరకు తొలగిస్తున్నట్టు కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్(Kurnool SP Vikranth Patil) పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు.


సీఐ శంకరయ్య సమక్షంలోనే వైఎస్ వివేకా హత్యకేసు నిందితులు.. ఆధారాలను చెరిపివేశారని గతంలో సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఈ ఆరోపణల్ని తోసిపుచ్చిన శంకరయ్య.. చంద్రబాబుకు లీగల్ నోటీసు పంపారు. తన పరువుకు భంగం కలిగించారని, అసెంబ్లీ వేదికగా తనకు క్షమాపణ చెప్పాలని, రూ.1.45 కోట్లు పరిహారం చెల్లించాలని అందులో డిమాండ్‌ చేశారు. కొన్నాళ్లుగా కర్నూలు రేంజ్‌లో వేకెన్సీ రిజర్వ్‌(వీఆర్‌)లో ఉన్న శంకరయ్య రాష్ట్ర ముఖ్యమంత్రికే లీగల్‌ నోటీసు పంపడం పోలీసు వర్గాల్లో పెద్ద చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే ఆయనపై క్రమశిక్షణా చర్యలకు ఉపక్రమించినట్టు తెలుస్తోంది.


ఇవీ చదవండి:

ఎన్నికల్లో పోటీచేయకుండానే.. మంత్రిగా ప్రమాణం..

69 ఏళ్లుగా చెక్కుచెదరని ఆ 'బాహుబలి' రికార్డ్..

Updated Date - Nov 21 , 2025 | 10:07 PM