మహానందిలో పల్లకీ సేవ
ABN , Publish Date - Jan 17 , 2025 | 11:25 PM
మహానంది క్షేత్రంలో శుక్రవారం రాత్రి పల్లకీ సేవను వైభవంగా నిర్వహించారు.

మహానంది, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): మహానంది క్షేత్రంలో శుక్రవారం రాత్రి పల్లకీ సేవను వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని కల్యాణ మంటపంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఆలయ అర్చకులు ఆశీనులుజేశారు. వేదపండితులు హనుమంత్‌శర్మ భక్తిశ్రద్ధలతో పూజలు జరిపారు. ఆలయం మెదటి ప్రాకారంలో భక్తుల శివనామస్మరణ మధ్య పల్లకీ ఉత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో టెంపుల్ ఇన్‌స్పెక్టర్ రాచమల్ల శ్రీనివాసులు, సిబ్బంది పాల్గొన్నారు.