28 నుంచి జాతీయ స్థాయి సెపక్‌తక్రా పోటీలు
ABN , Publish Date - Jan 07 , 2025 | 11:50 PM
క్రీడాభారతి ఆధ్వర్యంలో ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 2 వరకు జాతీయ స్థాయి జూనియర్ బాల, బాలికల సెపక్‌తక్రా పోటీలు నిర్వహిస్తున్నట్లు క్రీడాభారతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా.రామకృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సుధాకర్, నిమ్మకాయల సుధాకర్ తెలిపారు.

నంద్యాల, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): క్రీడాభారతి ఆధ్వర్యంలో ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 2 వరకు జాతీయ స్థాయి జూనియర్ బాల, బాలికల సెపక్‌తక్రా పోటీలు నిర్వహిస్తున్నట్లు క్రీడాభారతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా.రామకృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సుధాకర్, నిమ్మకాయల సుధాకర్ తెలిపారు. నంద్యాలలోని రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో మంగళవారం జాతీయ స్థాయి క్రీడా పోటీల పోస్టర్లన విడుదల చేశారు. వారు మాట్లాడుతూ ఐదు రోజుల పాటు జరిగే క్రీడా పోటీలకు దేశంలోని 26 రాష్ట్రాల నుంచి దాదాపు 500మంది క్రీడాకారులు, వందమంది కోచ్‌లు, అఫీషియల్స్ వస్తున్నట్లు చెప్పారు. నంద్యాల ఎస్బీఐ కాలనీలోని రామకృష్ణ పీజీ కళాశాలలోని కాశిరెడ్డి నాయన ఇండోర్ స్టేడియంలో పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పోటీల్లో ప్రాతినిథ్యం వహిస్తున్నవారికి రామకృష్ణ పీజీ కాలేజీలో వసతి కల్పిస్తున్నామని, భోజన సౌకర్యానికి దాతల సహకారంతో చేపడతామన్నారు. కార్యక్రమంలో సెపక్‌తక్రా అసోసియేషన్ జాతీయ ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, శ్రీధర్, క్రీడాభారతి సభ్యులు పాల్గొన్నారు.