మహాయాగంలో ఎమ్మెల్యే బీవీ
ABN , Publish Date - Nov 02 , 2025 | 12:56 AM
పట్టణంలోని వీవర్స్ కాలనీ మైదానంలో శ్రీకృష్ణపీఠం పీఠాధిపతి స్వరూపానంద స్వామీజీ ఆధ్వర్యంలో విశ్వశాంతి మహాయాగంలో భాగంగా రెండో రోజు మహాగణపతి, సుదర్శన రుద్రహోమాలు, రమాసతి సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు.
ఎమ్మిగనూరు, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని వీవర్స్ కాలనీ మైదానంలో శ్రీకృష్ణపీఠం పీఠాధిపతి స్వరూపానంద స్వామీజీ ఆధ్వర్యంలో విశ్వశాంతి మహాయాగంలో భాగంగా రెండో రోజు మహాగణపతి, సుదర్శన రుద్రహోమాలు, రమాసతి సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. హోమాల్లో ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఇలాంటి యాగాన్ని ప్రారంభిం చేందుకు తనకు అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ మల్లయ్య, టీడీపీ నాయకులు బాస్కర్ల చంద్రశేఖర్, మాచాని మహేశ్, మాచాని శివశంకర్, మహేంద్ర బాబు, మల్లెల ఆల్‌ఫ్రెడ్ రాజు, కేఎండీ ఫారుక్, మద్దిలేటి, నవీన్, జగదీష్, బీజేపీ నరసింహులు, నిర్వాహాకులు సత్యనారాయణ రెడ్డి, రాము, వడ్డే వీరేష్ పాల్గొన్నారు.