Share News

భక్తులకు భద్రత కరువు: వైసీపీ

ABN , Publish Date - Nov 02 , 2025 | 11:06 PM

కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలకే కాదు.. భక్తులకు కూడా భద్రత కరువైందని వైసీపీ ఎమ్మిగనూరు ఇన్‌చార్జి రాజీవ్‌ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి జగన్మోహన్‌రెడ్డి అన్నారు.

భక్తులకు భద్రత కరువు: వైసీపీ
కొవ్వొత్తులతో నిరసన తెలుపుతున్న వైసీపీ నాయకులు

ఎమ్మిగనూరు టౌన్‌, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలకే కాదు.. భక్తులకు కూడా భద్రత కరువైందని వైసీపీ ఎమ్మిగనూరు ఇన్‌చార్జి రాజీవ్‌ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి జగన్మోహన్‌రెడ్డి అన్నారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తోక్కిసలాటలో భక్తులు మృతి చెందిన ఘటనపై వైసీపీ కార్యకర్తలతో కలిసి పట్టణంలో కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ చేపట్టారు. గడ్డం నారాయణరెడ్డి, ఎంపీపీ కేశన్న, బుట్టా రంగయ్య, రియాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 02 , 2025 | 11:06 PM