ప్రజల మేలు కోసమే రాజకీయాల్లోకి వచ్చాను
ABN , Publish Date - Nov 02 , 2025 | 12:52 AM
ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చానని వైసీపీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్‌చార్జి రాజీవ్ రెడ్డి అన్నారు.
ఎమ్మిగనూరు, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చానని వైసీపీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్‌చార్జి రాజీవ్ రెడ్డి అన్నారు. పట్టణంలో మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి స్వగృహంలో శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ కుటుంబంపై ఎంతో నమ్మకంతో తనను ఇన్‌చార్జిగా నియమించారని అన్నారు. వర్గవిభేదాలు లేకుండా అందరినీ కలుపుకొని ముందుకెళ్తామన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే చెన్నకేవరెడ్డి మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా తనను ఆదరించిన ట్లే తన మనవడు రాజీవ్ రెడ్డిని ఆదరించాలని కోరారు. సమావేశంలో వైసీపీ సీనియర్ నాయకులు నాయకులు జగన్మోహాన్‌రెడ్డి, నాయకులు సోగనూరు భీమిరెడ్డి, రిజయాజ్, నారాయణ రెడ్డి, నాగేశప్ప, కాశీం బేగ్, గిడ్డయ్య, ఎంపీపీ కేశన్న పాల్గొన్నారు.