ముస్లిం సంక్షేమానికి సీఎం కృషి: టీడీపీ
ABN , Publish Date - Nov 17 , 2025 | 12:16 AM
ముస్లింల సంక్షేమానికి సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని, ఇచ్చిన మాట ప్రకారం ఇమామ్, మౌజమ్‌లకు వేతనాలు విడుల చేశారని జామీయ మసీదు అధ్యక్షుడు సాబీర్, మైనార్టీ సెల్ అధ్యక్షులు ఉసేన్ పీరా, టీడీపీ ముస్లిం, మైనార్టీ నాయకులు కలీముల్లా, కేఎండీ ఫరూక్, బందనవాజ్, తురేగల్ నజీర్, కౌన్సిలర్లు ఇసాక్, అమాన్, వహీద్‌లు అన్నారు.
ఎమ్మిగనూరు, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): ముస్లింల సంక్షేమానికి సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని, ఇచ్చిన మాట ప్రకారం ఇమామ్, మౌజమ్‌లకు వేతనాలు విడుల చేశారని జామీయ మసీదు అధ్యక్షుడు సాబీర్, మైనార్టీ సెల్ అధ్యక్షులు ఉసేన్ పీరా, టీడీపీ ముస్లిం, మైనార్టీ నాయకులు కలీముల్లా, కేఎండీ ఫరూక్, బందనవాజ్, తురేగల్ నజీర్, కౌన్సిలర్లు ఇసాక్, అమాన్, వహీద్‌లు అన్నారు. ఆదివారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ చిత్రపటాలకు నాయకులు క్షీరాభిషేకం చేశారు. న్యాయ, మైనార్టీ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్, ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు సలీమ్, అబ్దుల్లా, రఫీక్ పాల్గొన్నారు.