Share News

మార్కెట్‌ యార్డులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి: ఎమ్మెల్యే

ABN , Publish Date - Oct 31 , 2025 | 12:30 AM

ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్‌ యార్డులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ఆదేశించారు.

మార్కెట్‌ యార్డులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి: ఎమ్మెల్యే
గోడౌన్‌ వద్ద బాధితులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే బీవీ

ఎమ్మిగనూరు, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్‌ యార్డులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ఆదేశించారు. మార్కెట్‌లో గోడౌన్‌ వద్ద గోనెసంచులు కాలిపోయి నష్టం వాటిల్లిడంతో బాధితు రైతులతో మాట్లాడారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అగ్నిప్రమాదం జరగడానికి కారణాలు తెలియాల్సి ఉందన్నారు. అయితే అగ్నిప్రమాదంపై బాధితులు పలు అనుమాలు వ్యక్తం చేస్తున్నారన్నారు. ఆ మేరకు దర్యాప్తు చేసి పూర్తిస్థాయిలో విచారించాలని పోలీసులకు తెలిపారు.

సీసీఐ కేంద్రాల్లో పత్తిని విక్రయించుకోవాలి

సీసీఐ ద్వారా కొనుగోలు కేంద్రాల్లో రైతులు పత్తిని ఆ కేంద్రాల్లో విక్రయించుకోవాలని ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి సూచించారు. అధిక వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు కూడా కలెక్టర్‌తో మాట్లాడినట్లు తెలిపారు. రబీలో సాగునీరు అందించేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జీడీపీ ప్రాజెక్టు కింద రైతులకు సమృద్ధిగా నీరు అందజేస్తామన్నారు. ఎల్ల్లెల్సీ నీటి విడుదలపై నవంబరు 7వ తేదీన సమావేశం ఉందని, ఆ రోజు నీరు ఎప్పటి వరకు విడుదల చేస్తారో తెలుస్తుందన్నారు. అయినప్పటికీ రైతులు ఇబ్బంది పడకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. మార్కెట్‌ యార్డు చైర్మన్‌ మల్లయ్య, ప్రత్యేక శ్రేణి కార్యదర్శి చంద్రమౌళి, వైస్‌ చైర్మన్‌ అంజి, నాయకులు కాశింవలి, గోపాల్‌, మద్దిలేటి, కె. తిమ్మాపురం ఉరుకుందు, బీజేపీ నాయకులు నరసింహులు, శివ, సీఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ మధుసుదన్‌రెడ్డి, మార్కెట్‌ సిబ్బంది పాల్గొన్నారు.

పట్టణంలోని 17వ వార్డు మాజీ కౌన్సిలర్‌ బోయ లక్ష్మి, జయన్న దంపతుల కుమారుడు రామాంజనేయులు, జయన్న తల్లి ఇటీవల కాలంలో మృతి చెందారు. దీంతో వారి కుటుంబాన్ని ఎమ్మెల్యే బీవీ జయనాదేశ్వరరెడ్డి పరామర్శించారు.

పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయంలో ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి దేవాదాయశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నందవరం మండలంలో గురుజాల గ్రామంలో వెలసిన రామలింగేశ్వరస్వామి ఆలయం అభివృద్దిపై ఈవో రాంప్రసాద్‌ తో సమీక్షించారు. ఆలయ అభివృద్ధికి తీసుకోవాల్సిన అంశాలపై అడిగి తెలుసుకున్నారు. గురుజాల గ్రామంలోని రామలింగేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి అభివృద్ధిపై పూర్తిస్థాయిలో చర్చించనున్నట్లు తెలిపారు.

Updated Date - Oct 31 , 2025 | 12:30 AM