Kurnool BJP MLA : ప్రజల ఫిర్యాదుతో పార చేతబట్టి..!
ABN , Publish Date - Feb 09 , 2025 | 03:46 AM
బీజేపీ ఎమ్మెల్యే స్వయంగా పార చేతబట్టి మురుగు కాలువలను శుభ్రం చేసి అందరినీ ఆకర్షించారు.

కాలువలు శుభ్రం చేసిన ఆదోని ఎమ్మెల్యే
ఆదోని, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లా ఆదోనిలో బీజేపీ ఎమ్మెల్యే స్వయంగా పార చేతబట్టి మురుగు కాలువలను శుభ్రం చేసి అందరినీ ఆకర్షించారు. ఆదోని మండలం దిబ్బనకల్లు గ్రామంలో శనివారం ఎమ్మెల్యే పార చేతపట్టి ఇలా కాసేపు పారిశుధ్య పనులు చేపట్టారు. గ్రామంలో చాలా రోజులుగా మురుగు కాలువలు శుభ్రం చేయడం లేదని, దుర్వాసన వస్తోందని, దోమల బెడదతో రోగాల బారిన పడుతున్నామని ప్రజలు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన ఒక్కసారిగా పారిశుద్ధ్య కార్మికుడి అవతారమెత్తారు. పార చేతబట్టి మురుగు కాలువల్లో నిండిపోయిన పూడిక తీశారు. ఎమ్మెల్యేనే పూడిక తీయడంతో స్థానికులు కూడా చేయి కలిపి కాలువలను శుభ్రం చేశారు. గ్రామంలో పనిచేసే కార్మికులకు వేతనాలు ఇవ్వలేదని పంచాయతీ కార్మికులు తెలపడంతో ఆయన స్పందించారు. తనకు ప్రభుత్వమిచ్చే వేతనంలోంచి మీకు చెల్లిస్తా అని భరోసా ఇచ్చారు. ఇకపై పారిశుద్ధ్య పనులు నిలుపుదల చేయకుండా మురుగు కాలువలను శుభ్రం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Pawan Kalyan: ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం.. పవన్ కల్యాణ్ రియాక్షన్ ఇదే..
Betting Apps: బెట్టింగ్ యాప్స్ భూతానికి మరో యువకుడు బలి..