Share News

Rain Alert: ఏపీలో పలు జిల్లాల్లో గాలివాన బీభత్సం..

ABN , Publish Date - May 04 , 2025 | 11:22 AM

ఏపీలో పలు జిల్లాల్లో గాలి వాన బీభత్సం సృష్టించింది. రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు మరో రెండు రోజులు కొనసాగుతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉరుములు, మెరుపుల నేపథ్యంలో చెట్లకింద ఎవరూ ఉండవద్దని సూచించింది.

Rain Alert: ఏపీలో పలు జిల్లాల్లో గాలివాన బీభత్సం..
Heavy Rains In AP

విజయవాడ: ఏపీ(AP)లో పలు జిల్లాల్లో గాలి వాన బీభత్సం (Gale and rain) సృష్టించింది. కృష్ణా జిల్లా (Krishna district)లో తీవ్ర ఎండలు, ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్న సమయంలొ వాతావరణం (weather)లో ఒక్కసారిగా మార్పు చోటు చేసుకుంది. గన్నవరం రహదారి ప్రాంతంలో నల్లటి మేఘాలు ఒక్కసారిగా కమ్మేసాయి. భారీ ఈదురు గాలులతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు (Electricity disruption). కృష్ణా జిల్లా, కంకిపాడులో ఈదులుగాలులకు పలు హోర్డింగ్‌లు, చెట్లు కూలిపోవడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లో రోడ్లపై నీరు చేరింది. పలుచోట్ల విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది.


ఆందోళనలో మామిడి రైతులు

ఎన్టీఆర్ జిల్లా, మైలవరం నియోజకవర్గంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఈదురు గాలులతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో రెడ్డిగూడెం, మైలవరం మండలంలో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. గత మూడు రోజులుగా ఉక్కపోతతో అల్లాడిన ప్రజలు, వర్షం పడుతుండటంతో ఉపశమనం పొందారు. కాగా ఈదురు గాలులు వీస్తుండటంతో మామిడి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏప్రిల్‌లో వీచిన భారీ గాలులకు మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. మళ్లీ గాలులు వీస్తుండటంతో నష్టాలు తప్పవని రైతులు అంటున్నారు. దీంతో మైలవరం మార్కెట్ యార్డులో భారీగా మొక్కజొన్న నిల్వలు పేరుకుపోయాయి.

Also Read: నకిలీ దేశ గురువు మాయాజాలం


ఒక్కసారిగా మారిన వాతావరణం..

ఏలూరు జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మెగావృతమైన ఆకాశం భారీ గాలితో కూడిన వర్షం పడింది. రోడ్లపై నీరు చేరడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆదివారం సెలవు దినం కావడంతో ఉద్యోగులకు కొంత ఉపసమనం కలిగింది. కోణసీమ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అమలాపురంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్సం పడింది. అకాలవర్షంతో మామిడి సహా పలు ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం జరిగింది. ఒక్కసారిగా మబ్బులు కమ్ముకోవడంతో పగలే చీకటిగా మారిపోయిన వాతావరణం పట్టపగలు సైతం వాహనాలు లైట్లు వేసుకుని వెళుతున్న పరిస్థితి నెలకొంది. తూర్పు గోదావరి జిల్లా, కొవ్వూరు నియోజవర్గం తాళ్లపూడి చాగల్లు మండలంలో పలుచోట్ల ఉరుములతో కూడిన భారీ వర్షం పడింది. నిడదవోలు మండలంలో పలుచోట్ల ఉరుములతో కూడిన వర్షం కురిసింది.


మరో రెండు రోజులు వర్షాలు…

ఏపీలోని భిన్నమైన వాతావరణ పరిస్థితులు మరో రెండు రోజులు కొనసాగుతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. సోమ, మంగళవారం వరకు పలు చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆదివారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం,నె ల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. పిడుగుల హెచ్చరికల నేపథ్యంలో చెట్ల కింద నిలబడవద్దని హెచ్చరించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

తోపుదుర్తి కోసం రంగంలోకి దిగిన పోలీస్ బృందాలు..

హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలు..

For More AP News and Telugu News

Updated Date - May 04 , 2025 | 11:24 AM