Share News

Pulichintala Project Flood: పులిచింతలకు పోటెత్తిన వరద.. ఆ గ్రామాలకు హెచ్చరికలు

ABN , Publish Date - Oct 30 , 2025 | 11:58 AM

పులిచింతల నుంచి సుమారు 4 లక్షల 80 వేల క్యూసెక్కుల వరద నీరు చేరుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రకాశం బ్యారేజ్‌కు సాయంత్రానికి సుమారు 5 నుంచి 6 లక్షల క్యూసెక్కుల వరద చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Pulichintala Project Flood: పులిచింతలకు పోటెత్తిన వరద.. ఆ గ్రామాలకు హెచ్చరికలు
Pulichintala Project Flood

అమరావతి, అక్టోబర్ 30: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు పులిచింతల ప్రాజెక్ట్‌కు వరద (Pulichintala Project Flood) పోటెత్తింది. ప్రాజెక్ట్‌కు 5 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరడంతో.. అధికారులు 4 లక్షల 90 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ప్రకాశం బ్యారేజ్‌కు 2 లక్షల 74 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం చేరింది. దీంతో అధికారులు బ్యారేజ్ అన్ని గేట్లు ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్‌కు మున్నేరు, కీసర, వైర, కట్టలేరు నుంచి సుమారు 2 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరింది.


ఈరోజు (గురువారం) సాయంత్రానికి ప్రకాశం బ్యారేజ్‌కు పులిచింతల నుంచి సుమారు 4 లక్షల 80 వేల క్యూసెక్కుల వరద నీరు చేరుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రకాశం బ్యారేజ్‌కు సాయంత్రానికి సుమారు 5 నుంచి 6 లక్షల క్యూసెక్కుల వరద చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో బ్యారేజ్ దిగువ భాగాన ఉన్న కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాలలోని నదీతీర మండలాలు, గ్రామాల ప్రజలను రెవెన్యూ అధికారులు అప్రమత్తం చేశారు. లంక గ్రామాల ప్రజలు అలర్ట్‌గా ఉండాలని అధికారులు కోరారు.


అక్కడి ప్రజలు జాగ్రత్త: విపత్తుల నిర్వహణ సంస్థ

భారీ వర్షాలకు కృష్ణానది వరద ప్రవాహం పెరుగుతోందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వాహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. పులిచింతల, ప్రకాశం బ్యారేజ్ వద్ద దిగవకు వరద నీటి విడుదల చేసినట్లు చెప్పారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రస్తుతానికి ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 2.74 లక్షల క్యూసెక్కులుగా ఉందన్నారు. బ్యారేజ్ వద్ద సాయంత్రానికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని.. వరద ఫ్లో 5 లక్షల క్యూసెక్కులు వరకు చేరే అవకాశం ఉందని వెల్లడించారు. క్రమక్రమంగా వరద తగ్గే అవకాశం ఉందన్నారు. ఈ క్రమంలో లంక గ్రామ ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని.. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. నదిలో ప్రయాణం, ఈతకు వెళ్ళడం, చేపలు పట్టడం లాంటివి చేయరాదని ప్రఖర్ జైన్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

భారీ వర్షాలు.. ఏపీ జలవనరుల శాఖ కీలక ప్రకటన

చిన్న వెంకన్న ఆలయంలో విష సర్పాల కలకలం

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 30 , 2025 | 12:13 PM