Pedasanagallu Ayyanki Road Works: పెడసనగల్లు-అయ్యాంకి రహదారి పనులు షురూ.. దాతకు ఎమ్మెల్యే అభినందనలు
ABN , Publish Date - Oct 01 , 2025 | 02:16 PM
కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల్లో ప్రజలు కూడా భాగస్వామ్యం అవుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మానస పుత్రిక పీ 4 కార్యరూపం దాలిస్తే ఎలా ఉంటుందో నేటి కార్యక్రమం ద్వారా చూస్తున్నామన్నారు.
కృష్ణా జిల్లా, అక్టోబర్ 2: జిల్లాలోని మొవ్వ మండలం పెడసనగల్లు - అయ్యాంకి రహదారి అభివృద్ధి పనులను పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ఈరోజు (బుధవారం) ప్రారంభించారు. కృష్ణా జిల్లా టీడీపీ కార్యదర్శి నన్నపనేని వీరేంద్ర సమకూర్చిన సొంత నిధులు రూ.10 లక్షలతో రహదారి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. రహదారి అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే... దాత వీరేంద్రను అభినందించారు.
అనంతరం ఎమ్మెల్యే కుమార్ రాజా మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల్లో ప్రజలు కూడా భాగస్వామ్యం అవుతున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మానస పుత్రిక పీ 4 కార్యరూపం దాలిస్తే ఎలా ఉంటుందో నేటి కార్యక్రమం ద్వారా చూస్తున్నామన్నారు. నిధుల కొరత కారణంగా అన్ని ప్రాంతాల్లో రోడ్లు వేయలేకపోతున్నామని చెప్పారు. వీరేంద్ర లాంటి దాతలు పెద్ద మనసుతో ముందుకు వచ్చి ప్రజల సమస్యలు పరిష్కారానికి చొరవ చూపడం అభినందనీయమని కొనియాడారు. మంచి ప్రభుత్వ పాలనలో ప్రజలకు మంచి చేయడం కోసం దాతలు ముందడుగు వేయాలని ఎమ్మెల్యే కుమార్ రాజా పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి...
ఏపీలో సుస్థిర పట్టణాభివృద్ధికి సిటీ నెట్ సహకారం
Read Latest AP News And Telugu News