Pawan Kalyan: గత హయాంలో తిరుమలలో భారీ మోసం.. పవన్ సంచలన ట్వీట్
ABN , Publish Date - Nov 24 , 2025 | 03:44 PM
తిరుమల కేవలం ఆలయం కాదని.. భక్తికి మూలమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ పవిత్ర మందిరాన్ని గత టీటీడీ బోర్డు మోసం చేసిందని వ్యాఖ్యలు చేశారు.
అమరావతి, నవంబర్ 24: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల ఆలయానికి సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పలు విషయాలను పంచుకున్నారు. తిరుమల కేవలం ఆలయం కాదని.. భక్తికి మూలమన్నారు. ఈ పవిత్ర మందిరాన్ని ప్రతిరోజూ వేలమంది దర్శించుకుంటారని తెలిపారు. అలాంటి తిరుమలను గత టీటీడీ బోర్డు, అప్పటి అధికారులు మోసం చేశారంటూ మండిపడ్డారు. భక్తులు వారిపై ఉంచిన నమ్మకాన్ని, విశ్వాసాన్ని కించపరచారంటూ డిప్యూటీ సీఎం పవన్ ట్వీట్ చేశారు.
పవన్ ట్వీట్...
‘మన తిరుమల కేవలం ఒక ఆలయం కాదు... అది మన భక్తికి మూలం. గత ప్రభుత్వ హయాంలో (2019 – 24), అంచనా ప్రకారం 10.97 కోట్ల మంది దర్శనం చేసుకున్నారు. ప్రతిరోజూ 60,000 మంది భక్తులు పవిత్ర మందిరాన్ని సందర్శించారు. సాధారణ సామాన్యుడి నుంచి భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ప్రధాన న్యాయమూర్తితో సహా అత్యున్నత రాజ్యాంగ ప్రముఖుల వరకు.. పరిశ్రమల దిగ్గజాలు, క్రీడలు, కళలు, సాహిత్యం నుంచి ప్రముఖులతో పాటు. మనం భక్తితో నమస్కరించాం. గత టీటీడీ బోర్డు, ఆనాటి అధికారులు మన భక్తికి ద్రోహం చేశారు. మనం వారిపై ఉంచిన పవిత్ర నమ్మకాన్ని వారు విచ్చిన్నం చేశారు. వారు మన విశ్వాసాన్ని కించపరిచారు’ అంటూ పవన్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
శ్రీశైలం దేవస్థానం పేరిట నకిలీ వెబ్‌సైట్ కలకలం
డిప్యూటీ సీఎం పవన్ పర్యటనలో తెలుగు తమ్ముళ్ల మధ్య ఫైట్
Read Latest AP News And Telugu News