Share News

Ramprasad Praises CM: శ్రీచరణికి ప్రభుత్వ నజరానాపై క్రీడాశాఖ మంత్రి స్పందన

ABN , Publish Date - Nov 07 , 2025 | 01:47 PM

క్రీడా రంగం అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తీసుకుంటున్న నిర్ణయాలు చారిత్రాత్మకమైనవి అని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ అన్నారు. యువ క్రీడాకారులకు ప్రోత్సాహకంగా తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్ తరాలకు ఆదర్శమని తెలిపారు.

Ramprasad Praises CM: శ్రీచరణికి ప్రభుత్వ నజరానాపై క్రీడాశాఖ మంత్రి స్పందన
Ramprasad Praises CM

అమరావతి, నవంబర్ 7: వరల్డ్ కప్ గెలిచిన మహిళా క్రికెట్ జట్టు సభ్యురాలు శ్రీచరణికి (Sri Charani) రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా వరాలు ఇవ్వండపై రవాణా, యువజన క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి (Minister Mandipalli Ramprasad Reddy) హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. అంతర్జాతీయ క్రీడా ప్రతిభకు గుర్తింపుగా శ్రీచరణికి రూ.2.5 కోట్ల నగదు పురస్కారం, కడప జిల్లా స్వగ్రామంలో ఇంటి స్థలం కేటాయించడం కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని చెప్పుకొచ్చారు. శ్రీచరణికి గ్రూప్-1 ఉద్యోగం ప్రకటిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) తీసుకున్న నిర్ణయం ఆదర్శనీయమని అన్నారు. క్రీడాకారుల ప్రతిభను గౌరవించే సీఎంకు మంత్రి ధన్యవాదాలు తెలియజేశారు.


క్రీడా రంగం అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తీసుకుంటున్న నిర్ణయాలు చారిత్రాత్మకమైనవి అని అన్నారు. యువ క్రీడాకారులకు ప్రోత్సాహకంగా తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్ తరాలకు ఆదర్శమని తెలిపారు. శ్రీచరణి విజయంతో ఆంధ్రప్రదేశ్ క్రీడా రంగంలో కొత్త చరిత్ర మొదలైందన్నారు. క్రీడాకారుల కలలను సాకారం చేస్తున్న సీఎం, మంత్రి లోకేష్‌ దూరదృష్టి ప్రశంసనీయమైందని కొనియాడారు. శ్రీచరణి విజయంతో ఆంధ్రప్రదేశ్ పేరు అంతర్జాతీయ వేదికపై మార్మోగిందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.


కాగా.. ఈరోజు ఉదయం ఇండియన్ ఉమెన్ క్రికెటర్ శ్రీచరణి, మాజీ కెప్టెన్ మిథాలి రాజ్ క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. సీఎం క్యాంపు ఆఫీసుకు వచ్చిన ఇరువురిని మంత్రి లోకేష్ స్వాగతించారు. ఆపై ముఖ్యమంత్రిని కలిసిన శ్రీచరణి.. వరల్డ్ కప్ విజయంపై మాట్లాడారు. అంతకు ముందు గన్నవరం ఎయిర్‌పోర్టులో శ్రీచరణికి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కేశినేని చిన్ని, కార్యదర్శి సానా సతీష్, మంత్రులు అనిత, సవిత, సంధ్యారాణి, శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు ఘన స్వాగతం పలికారు.


ఇవి కూడా చదవండి...

ఆనందక్షణాలను సీఎంతో పంచుకున్న శ్రీచరణి

అక్టోబర్‌లో శ్రీవారి హుండీ ఆదాయం ఎంతంటే..

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 07 , 2025 | 03:45 PM