Lokesh: కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో లోకేష్ భేటీ.. ఏంటి మ్యాటర్
ABN , Publish Date - Jun 18 , 2025 | 11:25 AM
Minister Lokesh Delhi Visit: ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్రమంత్రులను మంత్రి నారా లోకేష్ కలువనున్నారు. ఈరోజు ఉదయం ఉపరాష్ట్రపతితో మంత్రి సమావేశమయ్యారు.
న్యూఢిల్లీ, జూన్ 18: దేశ రాజధాని ఢిల్లీలో మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) పర్యటన కొనసాగుతోంది. ఈరోజు ఉదయం (బుధవారం) ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్‌తో (Vice President Jagdeep Dhankhar) మంత్రి భేటీ అయ్యారు. అయితే మర్యాద పూర్వకంగానే ఉపరాష్ట్రపతిని కలిసినట్లు లోకేష్ కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. అమరావతిలో నిర్మించ తలపెట్టిన అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు కొత్త భవనాల్లో కొన్నింటికి వైస్ ప్రెసిడెంట్‌తో శంకుస్థాపన చేయించాలని సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఉపరాష్ట్రపతిని ఏపీకి రావాల్సిందిగా లోకేష్ ఆహ్వానించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మంత్రి లోకేష్‌తో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, సానా సతీష్, బైరెడ్డి శబరి.. ఉపరాష్ట్రపతిని కలిశారు.
ఇక నేడు ఢిల్లీలో మంత్రి బిజీబిజీగా గడుపనున్నారు. పలువురు కేంద్రమంత్రులతో లోకేష్ సమావేశంకానున్నారు. మధ్యాహ్నం 1:10 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీకానున్నారు. ఇది చాలా కీలకమైన సమావేశం. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్‌లో ఏపీకి చెందిన నేతల ఫోన్లు కూడా ట్యాప్ అయినట్లు సమాచారం. దీనిపై ప్రధానంగా కేంద్రమంత్రితో చర్చంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఏపీ లిక్కర్ కేసులో జరుగుతున్న పరిణామాలపై కేంద్ర హోంమంత్రికి వివరించనున్నట్లు సమాచారం. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మాజీ సీఎం జగన్‌కు సంబంధించిన వ్యవహారాలపై ఎక్కువగా చర్చించి అవకాశం ఉన్నట్లు సమాచారం.
అలాగే కేంద్రహోంమంత్రి అమిత్ షాతో పాటు మరో ముగ్గురు సెంట్రల్ మినిస్టర్లను కూడా మంత్రి లోకేష్ కలువనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్‌తో, సాయంత్రం 4:30 గంటలకు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో భేటీ అవుతారు. అలాగే సాయంత్రం 5:30 గంటలకు కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్‌తో మంత్రి లోకేష్ సమావేశమవుతారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి అంశాలపై కేంద్ర మంత్రులతో మంత్రి లోకేష్ భేటీ అయి చర్చించనున్నారు.
ఇవి కూడా చదవండి
నెలరోజుల తర్వాత విశాఖలో సన్నీ భయ్యా ప్రత్యక్షం
మొబైల్, ల్యాప్ టాప్ సమర్పించడానికి కేటీఆర్‌కు డెడ్ లైన్
ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి
Read Latest AP News And Telugu News