Share News

Lokesh Tribute Freedom Fighters: అల్లూరి, పింగళి వెంకయ్య, స్వామి వివేకానందకు మంత్రి లోకేష్ ఘన నివాళి

ABN , Publish Date - Jul 04 , 2025 | 09:54 AM

Lokesh Tribute Freedom Fighters: స్వాతంత్రత్య పోరాటయోధులు అల్లూరి, పింగళి వెంకయ్య, స్ఫూర్తిప్రధాత స్వామి వివేకానందకు మంత్రి నారా లోకేష్ ఘన నివాళులు అర్పించారు. వారి సేవలను స్మరించుకున్నారు మంత్రి.

Lokesh Tribute Freedom Fighters: అల్లూరి, పింగళి వెంకయ్య, స్వామి వివేకానందకు మంత్రి లోకేష్ ఘన నివాళి
Lokesh Tribute Freedom Fighters

అమరావతి, జులై 4: స్వాతంత్ర్య పోరాటయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామారాజు (Alluri Sitarama Raju ) జయంతి సందర్భంగా మంత్రి నారా లోకేష్ (Minister Nara lokesh) నివాళులర్పించారు. సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ.. అల్లూరి జీవితం ప్రతీ ఒక్కరికీ స్ఫూర్తిదాయకమన్నారు. అలాగే జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య (Pingali Venkayya), స్ఫూర్తిప్రదాత స్వామి వివేకానంద (Swamy Vivekananda) వర్థంతిని పురస్కరించుకుని ఇరువురు మహనీయులకు మంత్రి లోకేష్ ఘన నివాళులు అర్పించారు. ఆ మహనీయుల పోరాటాలు, ప్రతిభలు, త్యాగాలను ఈ సందర్భంగా మంత్రి స్మరించుకున్నారు.


అల్లూరి జీవితం అందికీ స్ఫూర్తి..

‘భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో బ్రిటీష్ వారికి సింహస్వప్నంగా నిలిచిన గొప్ప పోరాటయోధుడు అల్లూరి సీతారామరాజు. మన్యంలో పోరాట వీరులను తీర్చిదిద్ది.. బ్రిటీష్ సామ్రాజ్యానికి ఎదురొడ్డి నిలిచిన అల్లూరి సీతారామరాజు జీవితం ప్రతిఒక్కరికీ స్ఫూర్తిదాయకం. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నా ఘన నివాళులు అర్పిస్తున్నాను. ఆయన ఆశయ సాధన కోసం ప్రతిఒక్కరం పునరంకితం అవుదాం’ అని లోకేష్ అన్నారు.


పింగళి సేవలను స్మరించుకుందాం..

‘స్వాతంత్ర్య సమరయోధులు, జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య వర్థంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను. పింగళి వెంకయ్య తెలుగువారు కావడం మనందరికీ గర్వకారణం. విభిన్న రంగాల్లో తనదైన ప్రతిభ చూపారు. భారతజాతికి ఆయన అందించిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకుందాం’ అని మంత్రి వెల్లడించారు.


యువతకు స్ఫూర్తిప్రదాత స్వామి వివేకానంద

‘దేశప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన చైతన్యమూర్తి స్వామి వివేకానంద. యువతకు స్ఫూర్తిప్రదాతగా నిలిచారు. సనాతన ధర్మం గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. అవధులు లేని త్యాగం, అచంచల కృషి, అంతులేని ప్రేమ, అజరామరమైన సాహసం ఆయన సొంతం. తన ప్రసంగాలతో యువతకు దిశానిర్దేశం చేసిన స్వామి వివేకానంద వర్థంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి ఘన నివాళులు అర్పిస్తున్నాను’ అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.


ఇవి కూడా చదవండి

జగన్నాథ స్వామికి పట్టువస్త్రాలు సమర్పించిన హోంమంత్రి

కూలీ పంట పండింది.. విలువైన వజ్రం దొరికింది.. ధర ఎంతో తెలుసా..

Read latest AP News And Telugu News

Updated Date - Jul 04 , 2025 | 02:08 PM