Share News

CM Chandrababu LG Investment: ఎల్జీ పరిశ్రమ రాకపై సీఎం స్పందన ఇదీ

ABN , Publish Date - May 08 , 2025 | 04:44 PM

CM Chandrababu LG Investment: ఏపీకి ఎల్జీ నూతన ఉపకరణాల తయారీ కేంద్రం రావడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆనందం వ్యక్తం చేశారు. ఏపీకి ఎల్జీ రాకపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు సీఎం.

CM Chandrababu LG Investment: ఎల్జీ పరిశ్రమ రాకపై సీఎం స్పందన ఇదీ
CM Chandrababu LG Investment

అమరావతి, మే 8: రాష్ట్రంలోని తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం శ్రీ సిటీలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఏర్పాటుకు మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) ఈరోజు (బుధవారం) భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎల్జీ ఎలక్ట్రానిక్స్‌ కంపెనీ ఏపీకి రావడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఆనందం వ్యక్తం చేశారు. ఈ కంపెనీ ఏర్పాటుతో ఎన్నో ఉద్యోగావకాశాలు రానున్నాయని అన్నారు. ఎల్జీ రాకతో ఏపీ అంతర్జాతీయ గ్లోబల్ హబ్‌గా మారబోతోందని సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా సీఎం చంద్రబాబు పోస్టు చేశారు.


చంద్రబాబు ట్వీట్ ఇదే

‘ఆంధ్రప్రదేశ్‌లో ఎల్జీ నూతన ఉపకరణాల తయారీ కేంద్రం ఏర్పాటు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. రూ.5800 కోట్ల పెట్టుబడి 2500పైగా ప్రత్యక్ష, పరోక్షంగా ఉద్యోగాలు శ్రీ సిటీలో రానున్నాయి. ఎల్జీ గ్లోబల్ దాని అనుబంధ సంస్థలు ఏపీని అంతర్జాతీయ తయారీ హబ్‌గా రూపొందిస్తున్నాయి. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ తరపున నూటికి నూరు శాతం ప్రోత్సాహకం అందుకుంటూ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిలో నూతన అధ్యాయాన్ని లిఖించనుంది’ అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.

India Drone Attacks : ఇండియా డ్రోన్ అటాక్స్.. లబోదిబోమంటూ పాక్ ప్రెస్ మీట్


కాగా.. తిరుపతిలో శ్రీసిటీలో మంత్రి లోకేష్ చేతుల మీదుగా ఎల్జీ పరిశ్రమకు భూమి పూజ జరిగింది. ప్రధాన యూనిట్‌తో పాటు రూ.839 కోట్ల వ్యయంతో మరో ఐదు అనుబంధ యూనిట్లను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా రాబోయే ఆరేళ్లలో వివిధ దశల్లో సుమారు రూ.5001 కోట్ల పెట్టుబడులు పెట్టాలని, దాని ద్వారా 2000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని ఎల్జీ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ యూనిట్లలో ప్రధానంగా ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండిషనర్‌లతో పాటు ఇతర అత్యాధునిక ఎలక్ట్రానిక్ పరికరాలను ఉత్పత్తి చేయనుంది ఎల్జీ. భూమి పూజ అనంతరం మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. రూ.5,000 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఎల్జీ పరిశ్రమ.. ఏపీకి మరిన్ని పెట్టుబడులు పెట్టే నమ్మకాన్ని తెచ్చిందన్నారు. ఏపీ ఆర్థిక చరిత్రలో ఇది నిలిచిపోయే అంశమన్నారు. ఎల్జీ తమ సిస్టర్ సంస్థలను కూడా ఏర్పాటు చేసి ఏపీలో ఎల్జీ సిటీ ఏర్పడేలా చేయాలని ఆకాంక్షించారు. తిరుపతిలో అంతర్జాతీయ విమానయానం పెరిగేలా చేస్తామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యేలు ఆదిమూలం, సుధీర్ రెడ్డి, గాలి భాను ప్రకాష్, థామస్ తదితరులు పాల్గొన్నారు.

lg-electronics.jpg


ఇవి కూడా చదవండి

Jethwani Case: ఇద్దరు ఐపీఎస్‌లకు హైకోర్టులో బిగ్ రిలీఫ్

Pawan Viral Tweet: ప్రధాని మోదీపై పవన్ సంచలన ట్వీట్

Read Latest AP News And Telugu News

Updated Date - May 08 , 2025 | 04:46 PM