Sankranti 2025: కనివిని ఎరుగని రీతిలో ఏర్పాట్లు..
ABN , Publish Date - Jan 10 , 2025 | 01:16 AM
సంక్రాంతి పండుగ వేళ కోడి పందేల నిర్వహణకు హైటెక్ హంగులతో బరులు సిద్ధమవుతు న్నాయి. బాపులపాడు మండలం అంపాపురంలో 12 ఎకరాల వెం చర్‌లో భారీగా ఏర్పాట్లు జరుగు తున్నాయి. ఎల్‌ఈడీ తెరలు, విద్యుత్ దీపాలు, వీఐపీల కోసం ప్రత్యేకంగా గ్యాలరీలను రెడీ చేస్తున్నారు. రికార్డు స్థాయిలో పందేల నిర్వహణకు పక్కా ప్రణాళిక సిద్ధం చేశారు. ఇప్ప టికే పందెం రాయుళ్లు హను మాన్‌జంక్షన్‌లో హోటల్ రూమ్ లను బుక్ చేసుకున్నారు. ఈ ఏడాది కోట్ల రూపాయలు చేతులు మారనున్నాయి.
జిల్లాలో కోడి పందేల నిర్వహణకు చురుగ్గా ఏర్పాట్లు
అంపాపురంలో 12 ఎకరాల్లో భారీ సెట్టింగ్
ఎల్‌ఈడీ తెరలు, విద్యుత్ దీపాలు, వీఐపీ గ్యాలరీలు
రికార్డు స్థాయిలో పందేల నిర్వహణకు ప్రణాళిక
హోటళ్లలో రూమ్‌లు బుక్ చేసుకున్న పందెం రాయుళ్లు
చేతులు మారనున్న కోట్ల రూపాయల నగదు
ఆంధ్రజ్యోతి-హనుమాన్‌జంక్షన్‌రూరల్ /విజయవాడ రూరల్: సంక్రాంతి కోడి పందేలకు హైటెక్ హంగులతో బరులు రెడీ అవుతున్నాయి. ఒక వైపు అధికారులు ఊరుకునేది లేదంటూ హెచ్చరిస్తు న్నా.. మరో వైపు నిర్వాహకులు ఉరిమే ఉత్సాహంతో చకచకా బరులను సిద్ధం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రా ల్లో పేరిన్నికగన్న బాపులపాడు మండలం అంపాపురం ప్రధాన బరి కాగా, కె.సీతారాంపురం, బిళ్లనపల్లి గ్రామాల్లో చిన్నపాటి బరులను సిద్ధం చేస్తున్నారు. విజయవాడ రూరల్ మండలం అంబాపురం, జక్కంపూడిలో పందేలకు ఏర్పాట్లు చేస్తున్నారు. జాతీయ రహదారి పక్కనే ఉన్న 12 ఎకరాల వెంచర్‌లో ఏర్పాటు చేస్తున్న బాపులపాడు మండలం అంపాపురం బరికి హైటెక్ హంగులతో సొబగులద్దుతున్నారు. భారీ సెట్టింగులు, ఎల్‌ఈడీ తెరలు, వీఐసీ ట్రీట్మెంట్లతో ప్రధాన బరి సిద్ధమవుతుండగా, పక్కనే మరో మూడు బరులను రెడీ చేస్తున్నారు. పేకాట, గుండాట, కోసుల నిర్వహణ, బిర్యానీ పాయిం ట్ల ఏర్పాట్లకు పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
దూరప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లతో పాటు అన్నిరకాల వినోదాలు అందించేందుకు నిర్వాహకులు కార్యాచరణ మొదలుపెట్టారు. ఇప్పటికే రహదారులు శుభ్రం చేసి రంగులు వేస్తూ రాకపోకల మార్గాన్ని ఆకర్షణీయంగా తయా రు చేస్తున్నారు. రాత్రి పూట పందేలకు ఇబ్బంది లేకుండా భారీ ఎల్‌ఈడీ లైట్లు, విద్యుత్ దీపాల ఏర్పాటుతో పాటు ప్రత్యేకంగా జనరేటర్ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నారని సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగకు కోడిపందేల బరితో ప్రత్యేకత చాటుకుంటున్న అంపాపురం మరోసారి రూ.కోట్లలో పందేలు నిర్వహించేందుకు సన్నద్ధమ వుతోంది. పండగ మూడు రోజులు గతంలో జరిగినట్లే భారీగా పందేలు నిర్వహించడంతో పాటు విజేతలకు భారీ నజరానాలు, బహుమతులు ఇచ్చేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్టు నిర్వాహకుల్లో ఒకరు తెలిపారు. పందెం రాయుళ్లు విజయవాడ, గన్నవరం లాంటి ప్రాంతాలతో పాటు హనుమాన్‌జంక్షన్ లాంటి గ్రామాల్లో సైతం హోటళ్లలో గదులు బుక్ చేసుకుని పందేల కోసం ఎదురుచూస్తున్నారు.
జక్కంపూడి బరిని ధ్వంసం చేసిన కొత్తపేట పోలీసులు..
కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని జక్కంపూడి ప్రాంతంలో ఆఘమేఘాల మీద సిద్ధం చేసిన కోడి పందేల బరిని పోలీసులు గురువారం ధ్వంసం చేశారు. సుమారు ఎకరం పరిధిలో భూమిని చదును చేసిన విషయాన్ని తెలుసుకున్న ఎస్సై హరిప్రసాద్ సిబ్బందితో బరి వద్దకు చేరుకుని ట్రాక్టర్లతో చదును చేసిన ప్రాంతాన్ని దున్నించారు.