Share News

Wine Shop: ఆ జిల్లాకు కొత్తగా 23 మద్యం షాపులు..

ABN , Publish Date - Jan 08 , 2025 | 02:45 PM

ఉమ్మడి కృష్ణా జిల్లాలో మద్యం దుకాణాల సంఖ్య పెరగనుంది. నూతనంగా మరో 25 షాపులు ఏర్పాటు కానున్నాయి. దీనికి సంబంధించి ప్రకటన త్వరలో వెలువడనుంది. కొత్త దుకాణాలను గీత కార్మికులకు కేటాయించనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత..

Wine Shop: ఆ జిల్లాకు కొత్తగా 23 మద్యం షాపులు..
New Wine Shops

విజయవాడ, జనవరి 08: ఉమ్మడి కృష్ణా జిల్లాలో మద్యం దుకాణాల సంఖ్య పెరగనుంది. నూతనంగా మరో 25 షాపులు ఏర్పాటు కానున్నాయి. దీనికి సంబంధించి ప్రకటన త్వరలో వెలువడనుంది. కొత్త దుకాణాలను గీత కార్మికులకు కేటాయించనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెచ్చిన కొత్త మద్యం పాలసీ ప్రకారం ఉమ్మడి కృష్ణా జిల్లాలో 256 దుకాణాలు ఏర్పాటయ్యాయి. ఎన్టీఆర్ జిల్లాలో 113, కృష్ణా జిల్లాలో 123 దుకాణాలు ఉన్నాయి. విజయవాడలో మొత్తం 39, మచిలీపట్నంలో 5 షాపులు ఏర్పాటయ్యాయి. ఎన్టీఆర్ జిల్లాలో అన్ని మండలాల్లో కలిపి 58, కృష్ణా జిల్లాలో ఉన్న మండలాల్లోనూ కలిపి 98 షాపులు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో ఎనిమిది ఎక్సైజ్ స్టేషన్లు ఉండగా విజయవాడలో మూడు ఉన్నాయి. విజయవాడ తూర్పు, పశ్చిమ, భవానీపురం స్టేషన్లు ఉన్నాయి. ఇవి కాకుండా జగ్గయ్యపేట, కంచికచర్ల, మైలవరం, నందిగామ, తిరుపూరులో ఎక్సైజ్ స్టేషన్లు ఉన్నాయి. కృష్ణా జిల్లాలో మొత్తం ఎనిమిది స్టేషన్లు ఉన్నాయి. మచిలీపట్నం, అవనిగడ్డ, బంటుమిల్లి, గన్నవరం, గుడివాడ, మొవ్వ, నందివాడలో స్టేషన్లు ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పటి వరకు కేటాయించిన షాపులు కాకుండా కల్లు గీత కార్మికులకు కొన్ని షాపులు రిజర్వ్ చేస్తామని ప్రకటించింది. దీని ప్రకారం నూతనంగా 23 షాపులు రానున్నాయి. ప్రస్తుతం ఉన్న 236 మద్యం దుకాణాలతో కలిపి మొత్తం 259 దుకాణాలు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉంటాయి. కొత్తగా ఏర్పాటయ్యే షాపులకు రెండేళ్ల కాలపరిమితికి లైసెన్స్ ఇస్తారు. కొత్త షాపులకు ఫీజు వివరాలు, ఇతర షరతులు త్వరలో వెలువడనున్నాయి.


ఎన్టీఆర్ జిల్లాలో ప్రస్తుతం ఉన్న షాపులు..

విజయవాడ (39), జగ్గయ్యపేట (4), కొండపల్లి (2), నందిగామ (6), తిరువూరు (1) ఉండగా.. మండలాల వారీగా ఎ.కొండూరు (2), చందర్లపాడు (3), జికొండూరు (4), గంపలగూడెం (4), ఇబ్రహింపట్నం (3), జగ్గయ్యపేట రూరల్ (4), కంచికచర్ల (5), మైలవరం (4), నందిగామ రూరల్ (2), పెనుగంచిప్రోలు (5) రెడ్డిగూడెం (2) తిరుపూరు రూరల్ (2), వత్సవాయి (2), వీరులపాడు (2), విజయవాడ రూరల్ (10).


కృష్ణా జిల్లాలో ప్రస్తుతం ఉన్న షాపులు..

మచిలీపట్నం (5), గుడివాడ (7), పెడన (4), తాడిగడప (3), ఉయ్యూరు (6), మండలాల వారీగా.. అవని గడ్డ (2), బంటుమిల్లి(3), బాపులపాడు (9), చల్లపల్లి (4), గన్నవరం (9) ఘంటసాల (3), గుడివాడ రూరల్ (2), గుడ్లవల్లేరు (6), గూడూరు (2), కంకిపాడు (7), కోడూరు (3), కృత్తివెన్ను (4), మచిలీపట్నం రూరల్ (3), మోపిదేవి (3), మొవ్వు (4), నాగాయలంక (3), నందివాడ (4), పామర్రు (4), పమిడిముక్కల (3), పెడన రూరల్ (2), పెదపారు పూడి (2), పెనమలూరు (5), తోట్లవల్లూరు (3), ఉంగుటూరు (5), ఉయ్యూరు రూరల్ (3).


Also Read:

కేటీఆర్‌కు బిగుస్తున్న మరో ఉచ్చు..

ఏపీ ఇంటర్ బోర్డ్ సంచలన నిర్ణయం

విశాఖ ఎయిర్‌పోర్టుకు ప్రముఖుల తాకిడి

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Jan 08 , 2025 | 02:45 PM